Anirudh Music for NTR-Koratala Movie

Saturday,June 05,2021 - 06:56 by Z_CLU

NTR Koratala Movie కి సంబంధించి మరో అప్ డేట్ రెడీ అయింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం పెండింగ్ లో ఉంది. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

నిజానికి ఎన్టీఆర్ సినిమాకు గతంలోనే వర్క్ చేయాల్సింది అనిరుధ్. తారక్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమాకు ముందుగా అనిరుధ్ నే అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో తమన్ ను తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ అందుకున్నాడు అనిరుధ్.

[caption id="attachment_190518" align="alignnone" width="624"]ntr janatha garage zeecinemalu జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్[/caption]

అటు దర్శకుడు కొరటాల శివకు కూడా అనిరుధ్ తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా దేవిశ్రీప్రసాద్ తోనే వర్క్ చేశాడు కొరటాల. ప్రస్తుతం చేస్తున్న ఆచార్యకు మాత్రం చిరంజీవి కోరిక మేరకు మణిశర్మతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ తో వర్క్ చేయబోతున్నాడు.

ఈ ప్రాజెక్టులోకి అనిరుధ్ ను తీసుకురావడం అనేది ఎన్టీఆర్ నిర్ణయమా.. లేక కొరటాల తీసుకున్న డెసిషనా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండూ కాకుండా, త్రివిక్రమ్ దగ్గరుండి అనిరుధ్ ను రిఫర్ చేసినట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈసారి ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ వర్క్ చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే.

[caption id="attachment_152802" align="alignnone" width="587"]anirudh zeecinemalu సంగీత దర్శకుడు అనిరుధ్[/caption]

మరోవైపు తారక్-కొరటాల మధ్య సినిమాకు సంబంధించి వర్చువల్ గా ఎప్పటికప్పుడు డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు సగానికి పైగా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన కొరటాల.. ఆచార్య షూట్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ కోసమే టైమ్ కేటాయించబోతున్నాడు. ఈ సినిమాను 7 నెలల్లో (పోస్ట్-ప్రొడక్షన్ తో కలిపి) పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట కొరటాల. అలా ఆచార్యతో వచ్చిన గ్యాప్ ను కవర్ చేసుకోవాలనేది కొరటాల ఆలోచన.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics