Anil Ravipudi speech about ‘GaaliSampath’ !

Monday,March 08,2021 - 02:37 by Z_CLU

 సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా ఉంటూ స్క్రీన్ ప్లే అందిస్తున్న 'గాలి సంపత్' సినిమా రిలీజ్ కి రెడీ అయింది. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా  మార్చ్ 11 న మహా శివరాత్రి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ " నేను సాయి బెస్ట్ ఫ్రెండ్స్‌.  2005లో బ్ర‌మ‌రాంబ థియేట‌ర్‌లో 'అత‌డు' సినిమాలో సాయి నాకు క‌లిశాడు. నా క‌ష్ట న‌ష్టాల్లో, నా ఆనందంలో అన్నింటిలో సాయి ఉన్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సాయి నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. నా స‌క్సెస్ అన్నింటిలో చాలా కీ రోల్ పోషించాడు.  అలాంటి సాయి మంచి క‌థ రాశాడు, 'గాలి సంప‌త్' క‌థ దీంతో నేను ప్రొడ్యూస‌ర్ అవ్వాలి అనుకున్నాడు. దానిని  ముందుకు తీసుకు వెళ్లడానికి మాకు సాహూ గార‌పాటి, హ‌రీష్ పెద్ది చాలా హెల్ప్ చేశారు. త్వ‌ర‌లో వారితో ఒక మంచి సినిమా చేయ‌బోతున్నాను. 'గాలి సంప‌త్'  కొత్త క‌థ‌. కొత్త ప్ర‌య‌త్నం. స‌క్సెస్ పై మీమంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనీష్‌కి ఈ సినిమా త‌ర్వాత మంచి సినిమాలు రావాలి.  మంచి టీమ్ కుదిరింది. గాలి సంప‌త్ గా రాజేంద్ర ప్ర‌సాద్ ఫిక్స్ అయ్యాక ఆయ‌న కొడుకుగా ఎవ‌రు చేయాలి అని అనుకున్న‌ప్పుడు మాకు శ్రీ విష్ణు త‌ప్ప ఇంకో ఆప్ష‌న్ క‌న‌ప‌డ‌లేదు. విష్ణుకి ఈ సినిమా డైఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ గారితో 'సుప్రీమ్' నుండి మా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. ఎంట‌ర్‌టైన్ మెంట్లో ఆయ‌న్ని కొట్టేవారే లేరు. ఈ సినిమాలో మ‌రో లెవ‌ల్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నాడు. ఆయ‌న క‌ష్టం రేపు స్క్రీన్ మీద చూస్తారు. మ‌న‌ల్ని కొన్నేళ్లు న‌వ్వించిన రాజేంద్ర ప్ర‌సాద్ గారి  కోసం నేను  నా ఫ్యామిలీతో క‌లిసి మార్నింగ్ షో సినిమా చూస్తున్నాను, మీరు కూడా సినిమా చూసి ఆయ‌న‌కి ఒక సెల‌బ్రేష‌న్ ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. నా ఐదు సినిమాల జ‌ర్నీలో నా వెంట ఉంది ప్రేక్ష‌కులు. ప్ర‌తి సినిమాని మీ కుటుంభంతో వ‌చ్చి ఆద‌రించారు.  ఒక కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఈ సినిమాని కూడా మీరు వ‌చ్చి ఆద‌రించాల‌ని నా హంబుల్ రిక్వెస్ట్. రామ్ గారితో నా జ‌ర్నీ చాలా కాలం నుండి ఉంది. త్వ‌ర‌లో ఆయ‌న‌తో అద్భుత‌మైన సినిమా చేయాల‌నుకుంటున్నాను`` అన్నారు.