AlluArjun’s Pushpa Release on Dussehra?

Tuesday,December 08,2020 - 12:40 by Z_CLU

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న Pushpa సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని  ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.  ఇంకా సెట్స్ పై ఉండగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై గట్టిగా చర్చ నడుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోన ఎఫెక్ట్ తో ఇటివలే మొదలైన షూటింగ్ కూడా మళ్ళీ వాయిదా పడింది.

దీంతో మేకర్స్ ఇప్పుడు సమ్మర్ ని అందుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క షెడ్యుల్ మాత్రమే పూర్తయింది. ఇంకా షూట్ చేయాల్సిన పార్ట్ చాలా ఉంది. ఎంత స్పీడ్ గా తీసినా నాలుగు నెలలపైనే పట్టొచ్చు. అంటే సమ్మర్ కల్లా సినిమాను పూర్తి చేయడం ఇంపాజిబుల్. సమ్మర్ కాకపోతే మేకర్స్ చేతిలో ఉన్న మరో ఆప్షన్ దసరా మాత్రమే. సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాలకు మంచి బిజినెస్ వచ్చేది దసరా సీజనే. అందుకే పుష్ప ను ఆ సీజన్ లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే రెండు మూడు నెలలు ఆగాల్సిందే.