Allu Arjun’s Pushpa to Release on Christmas 2021

Tuesday,August 03,2021 - 03:51 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు లాక్ అయింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది క్రిస్మస్ లో పుష్ప ది రైజ్ పార్ట్-1ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు యూనిట్ గ్రాండ్ గా ఎనౌన్స్ చేసింది.

అయితే విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది క్రిస్మస్ శనివారం పడింది. కాబట్టి ఈ ఫెస్టివల్ కు ఒక రోజు లేదా, 2 రోజుల ముందు పుష్ప పార్ట్-1 థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ డేట్ లాక్ చేయడంతో ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే, బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికే వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం, పుష్పను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే తీసుకొస్తారని అంతా భావించారు.

pushpa release date

కానీ సంక్రాంతికి ఇప్పటికే 3 పెద్ద సినిమాలు లాక్ అయ్యాయి. పవన్, ప్రభాస్, మహేష్ తమ సినిమాల్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు వెంకీ-వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్3 సినిమా కూడా సంక్రాంతికే వచ్చేలా ఉంది. దీంతో మరింత పోటీని పెంచడం ఇష్టంలేక, సంక్రాంతి కంటే 3 వారాల ముందు, క్రిస్మస్ కానుకగా పుష్పను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు బన్నీ.

పాన్ ఇండియన్ మూవీగా 5 భాషల్లో ఒకేసారి వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు పుష్ప సినిమాని. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు నార్త్ లో హిందీ వెర్షన్ లో ఈ సినిమా విడుదలకాబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే బన్నీ కెరీర్ లో ఇదే ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా మూవీ. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics