Allu Arjun’s ‘Pushpa The Rise’ Trailer Update here!

Monday,November 29,2021 - 12:01 by Z_CLU

'పుష్ప ది రైజ్' రిలీజ్ కి ఇంకా ఎనిమిది రోజులే ఉంది. మేకర్స్ చేతిలో ప్రమోషన్స్ కోసం ఉన్నదే పట్టుమని రెండు వారాలే.

ట్రైలర్  రిలీజ్ ఎప్పుడు ?

ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ప్లాన్స్ ఏంటి ? 

ఇలా సవాలక్ష ప్రశ్నలు బన్నీ ఫ్యాన్స్ ని కుదిపేస్తున్నాయి. అయితే వీటన్నిటికి ఓ అప్ డేట్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ముందుగా 'పుష్ప ది రైజ్' ట్రైలర్ రిలీజ్ డేట్ న్యూ పోస్టర్ తో చెప్పేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అంటే సరిగ్గా ఏడు రోజుల్లో బన్నీ కొత్త ట్రైలర్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా చేయబోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ వర్క్ జరుగుతుంది. పుష్ప రాజ్ ఇంట్రో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ని ట్రైలర్ తో  బీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకే గూస్ బంప్స్ వచ్చే షాట్స్ , సీన్స్ తో ట్రైలర్ రెడీ చేస్తున్నారు. సుక్కు ఇప్పటికే బెస్ట్ షాట్స్ గురించి ఎడిటర్ తో డిస్కస్ చేస్తూ వర్క్ చేయిస్తున్నాడు. ట్రైలర్ లో మిగతా క్యారెక్టర్స్ కూడా ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త తీసుకుంటున్నారట, అలాగే ఫ్యాన్స్ కోసం బన్నీచిత్తూరు యాసలో చెప్పిన  స్పెషల్ డైలాగ్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

PushpaTrailer-update-poster-zeecinemalu

ప్రస్తుతం బన్నీ -సమంత లపై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈరోజు నుండి ఐదు రోజుల పాటు సాంగ్ షూట్ జరగనుంది. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ -మౌనికలు  సెట్ వేశారు. అందులోనే షూట్ జరుగుతుంది. గణేష్ ఆచార్య ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ  సాంగ్ షూట్ తో టోటల్ షూట్ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొట్టేయనున్నారు యూనిట్. అక్కడి నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టి భారీ ప్లాన్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న 'పుష్ప ది రైజ్' వచ్చే నెల డిసెంబర్ 17న థియేటర్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics