Allu Arjun Sukumar sets Target for Pushpa

Thursday,November 19,2020 - 12:10 by Z_CLU

ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న AlluArjun-Sukumar ఇద్దరూ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. Pushpa సినిమా తర్వాత ఇద్దరికీ చెరో ప్రాజెక్ట్ ఉంది. 'పుష్ప' షూట్ అవ్వగానే బన్నీ కొరటాల సినిమాకు షిఫ్ట్ అయితే సుక్కు విజయ్ దేవరకొండ సినిమా పనులు మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకురావాలి. అందుకోసం వీరిద్దరూ కలిసి తక్కువ టైంలో షూట్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు.

వచ్చే ఏడాది సమ్మర్ కల్లా సినిమాకు సంబంధించి టోటల్ షూట్ పూర్తి చేయాలనీ సుక్కు ప్లాన్ రెడీ చేసుకున్నాడు. లాక్ డౌన్ లో షూట్ కి సంబంధించి ఓ ప్రణాళిక సిద్దం చేసుకున్న సుక్కు అండ్ టీం ప్రస్తుతం ఆ ప్లాన్ ప్రకారమే వర్క్ చేస్తూ జెట్ స్పీడ్ లో సీన్స్ షూట్ చేస్తున్నారట.

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లోని మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి అనుకున్న టార్గెట్ కే సుకుమార్ షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ ఎండింగ్ కల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాడేమో చూడాలి.

Allu Arjun సరసన Rashmika హీరోయిన్ గా నటిస్తుంది. Mythri Movie Makers సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Also Check - పుష్ప ఆన్-లొకేషన్ స్టిల్