Allari Naresh Words about ‘Itlu Maredumilli Prajaneekam’ Movie

Thursday,November 24,2022 - 03:27 by Z_CLU

 అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' తో రేపే థియేటర్స్ లోకి వస్తున్నాడు. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడు. అటవీ ప్రాంతంలో గిరిజన ప్రజల హక్కులు , ఎలక్షన్స్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు నరేష్ అండ్ టీం చాలా కష్టపడ్డారు. తాజాగా అల్లరి నరేష్ ఆ విషయాలను షేర్ చేసుకున్నాడు.

"మారేడుమిల్లిలో చాలా రోజులు షూట్ చేశాం. అక్కడి నుండి షూట్ లొకేషన్ కి వెళ్లేందుకు రెండు గంటలు సమయం పట్టేది. కొండలు ఎక్కుతూ వెళ్ళాల్సి వచ్చేది. అటవీ ప్రాంతం కావడంతో ఎక్కువ శబ్దం చేయకుండా వెళ్లాలని సూచించారు. అందువల్ల సైలెంట్ గా వెళ్ళేవాళ్ళం. ఫిజికల్ గా ఎక్కువ కష్టపడిన సినిమా ఇది. నాతో పాటు క్రూ అందరూ చాలా కష్టపడ్డారు. నడుస్తూ వెళ్ళడమే కష్టం అంటే ఎక్యుప్ మెంట్ నెత్తిన పెట్టుకొని నడిచేవాళ్ళు. అలాగే పాడేరు లో కూడా కొన్ని షూట్ చేశాం. హైదరాబాద్ లో సెట్ వేసి మరికొన్ని షూట్ చేశాం. "

"ఈ సినిమా కంప్లీట్ సీరియస్ గా ఉంటుందనుకుంటే పొరపాటు పడ్డట్టే. వెన్నెల కిషోర్ , ప్రవీణ్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. అరవై శాతం సీరియస్ గా మిగతా నలబై శాతం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మా టీం అందరూ లాస్ట్ మూమెంట్ వరకూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. రేపు సినిమా ప్రేక్షకులను నచ్చుతుందని ఆశిస్తున్నాను" అంటూ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా విశేషాలు చెప్పుకొచ్చాడు నరేష్.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics