Allari Naresh speech at Ugram PreRelease event

Tuesday,May 02,2023 - 04:46 by Z_CLU

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరోలు అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "ఉగ్రం నా 60వ సినిమా. ఈ జర్నీలో చాలా మంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు  వున్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. నాందికి పని చేసిన టీం దాదాపుగా ఉగ్రంకి పని చేశాం. విజయ్, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే నాందికి మించి వుండాలని భావించాం. ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు విజయ్, సిద్, అబ్బూరి రవి గారు, శ్రీచరణ్ .. అందరూ కష్టపడి పని చేశాం. మిర్నా చక్కగా నటించింది. మా నిర్మాతలు సాహు గారు హరీష్ గారు ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ, ప్రతి కార్మికుడికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ వేడుకు వచ్చిన అడివి శేష్,  నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు శివ నిర్వాణ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, విఐ ఆనంద్ .. అందరికీ కృతజ్ఞతలు. ఉగ్రం కోసం 73 రోజులు రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేశాం. ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్, ప్రుద్వి మాస్టర్  వెంకట్ మాస్టర్ .. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు. ఇందులో ఆరు ఫైట్లు వుంటాయి. ఇప్పటి వరకు మీకు కితకితలు పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్ చేశాను. కానీ ఇందులో ఉగ్ర రూపం చూడబోతున్నారు. ఇందులో ఇంటెన్స్ నరేష్ ని చూస్తారు. నాంది ని గొప్పగా ఆదరించారు. దానికంటే కంటే పదిరెట్లు ఈ సినిమాని ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాను. మే 5న సినిమా విడుదలౌతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి’’ అని కోరారు.