Allari Naresh – My first priority is Comedy

Tuesday,February 16,2021 - 05:00 by Z_CLU

ఈ వీకెండ్ నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అల్లరి నరేష్. ఇదొక సీరియస్ మూవీ. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చేస్తానంటున్నాడు అల్లరోడు. అయితే తన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎప్పటికీ కామెడీ సినిమాలే అంటున్నాడు.

"ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. నా ఫస్ట్ ప్రియార్టీ కామెడీనే.. దానిని వదలను. మధ్య మధ్యలో నాంది లాంటి డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ చేస్తాను. టీమ్ అందరూ చాలా కష్టపడి విజయ్ కోసం నాంది సినిమా చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నాంది టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది. అందర్నీ ఒక కొత్త పందాలో ఆడియెన్స్ చూస్తారు. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా చేశాం.."

నవమి హీరోయిన్ గా యస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సతీష్ వేగేశ్న "నాంది" చిత్రాన్ని నిర్మించారు.