Alia Bhatt to join RRR sets today

Monday,December 07,2020 - 10:02 by Z_CLU

మరో కీలకమైన షెడ్యూల్ లోకి ఎంటరైంది RRR మూవీ. ఈ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి మరో కొత్త షెడ్యూల్ బిగిన్ అవుతుంది. ఈసారి ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. హీరోయిన్ అలియాభట్ సెట్స్ పైకి వస్తుంది.

దాదాపు ఏడాది కిందటే సెట్స్ పైకి రావాలి అలియాభట్. కానీ పూణె షెడ్యూల్ లో Ramcharan గాయపడ్డంతో ఆ షెడ్యూల్ కాన్సిల్ అయింది. అప్పట్నుంచి వివిధ కారణాల వల్ల అలియా ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఇవాళ్టి నుంచి ఆమె హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా 50 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. పూర్తిగా నైట్ మోడ్ లో చేసిన షెడ్యూల్ ఇది. ఆ తర్వాత యూనిట్ మరో చిన్న షెడ్యూల్ కోసం మహాబళేశ్వర్ వెళ్లింది. ఆ షెడ్యూల్ కూడా పూర్తిచేసి, ఇవాళ్టి నుంచి హైదరాబాద్ షెడ్యూల్ ను మొదలు పెట్టబోతోంది.

ఇలా గ్యాప్ లేకుండా RRR షూటింగ్ ను పరుగులుపెట్టిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. మార్చి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయాలనేది రాజమౌళి టార్గెట్.

Also Check - RRR మూవీ స్టిల్స్