Alia Bhatt Character is a surprise in RRR Movie

Saturday,June 12,2021 - 03:48 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR' నుండి ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ బయటికొచ్చింది. సినిమాలో హీరోలిద్దరి తర్వాత మరో క్యారెక్టర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయనున్నాడట జక్కన్న. ఈ సినిమాకు గానూ సీత పాత్రకు బాలీవుడ్ నుండి అలియా భట్ ని తీసుకున్నాడు రాజమౌళి. ఆ పాత్రకి ఆమెను తీసుకోవడానికి రీజన్ పాన్ ఇండియా సినిమా కావడమని అందరూ అనుకున్నారు. కానీ దానితో పాటు మరో రీజన్ కూడా ఉందట. కథలో సీత పాత్ర చిన్నదే అయినా ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఇటివలే రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

[caption id="attachment_186375" align="alignnone" width="448"]alia bhatt as Sita in RRR RRRలో అలియా భట్[/caption]

దీంతో జక్కన్న స్క్రీన్ పై మరో పవర్ ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే లేడీ క్యారెక్టర్ చూపించబోతున్నాడని అందరికి క్లారిటీ వచ్చేసింది. మగధీర లో మిత్రవింద , బాహుబలిలో దేవసేన పాత్రలు ఎంతగా క్లిక్ అయ్యయో ఆ రేంజ్ లో రౌద్రం రణం రుధిరం సినిమాలో సీత పాత్ర అంతలా క్లిక్ అవుతుందని యూనిట్ ధీమాగా చెప్తోంది. ఇక తండ్రితో మంచి కథలే కాదు వాటిలో చక్కని పాత్రలు డిజైన్ చేయించుకొని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దంలో జక్కన్న దిట్ట అన్న సంగతి తెలిసిందే. మరి అలియా ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా ఏ రేంజ్ కెళుతుందో చూడాలి. ఈ పాత్ర కోసం ఆమె దాదాపు ఆరు కోట్లు తీసుకుందని సమాచారం.

[caption id="attachment_182840" align="alignnone" width="650"]RRR_movie_alia_bhatt_rajamouli_working_stills దర్శకుడు రాజమౌళితో అలియా భట్[/caption]

డివివి ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే ఆ షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics