‘Ala Vaikunthapurramuloo’ team coming up with another project ?

Saturday,October 30,2021 - 10:00 by Z_CLU

'Ala Vaikunthapurramuloo' team coming up with another project ?

రెండేళ్ళ క్రితం వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిందే. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.  'నా పేరు సూర్య' తో దిగాలు పడిన బన్నీకి మళ్ళీ మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా.

ఇక రిలీజ్ కి ముందు తమన్ పాటలు కూడా మెస్మరైజ్ చేసి రిలీజ్ తర్వాత మరిన్ని వ్యూస్ కొల్లగొట్టాయి. అందుకే ఈ కాంబోలో మరో  సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే నిర్మాత మళ్ళీ అదే టీంతో ఇంకో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషయానికి సంబంధించి చిన్న హింట్ కూడా ఇచ్చారు నాగ్ వంశీ. అల్లు అర్జున్ , త్రివిక్రమ్ , తమన్ లతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటో షేర్ చేస్తూ 'సప్రయిజ్ కమింగ్ సూన్' అంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

alluarjun-trivikram-thaman-nagavamsi-zeecinemalu

 -   'వరుడు కావలెను' మూవీ రివ్యూ

దీంతో ఈ కాంబో లో మళ్ళీ సినిమా రాబోతుందనే విషయం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. కొంత గ్యాప్ తర్వాత 'పుష్ప 2' కి సంబంధించి షూట్ చేయాల్సి ఉంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో చేసే ప్లానింగ్ లో ఉన్నాడు బన్నీ. నెక్స్ట్ లిస్టు లో శ్రీరామ్ వేణు , బోయపాటి శ్రీను ,  మురుగదాస్ వంటి డైరెక్టర్స్ ఉన్నారు. మరి వారిని పక్కన పెట్టి బన్నీ తనకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తోనే  నెక్స్ట్ సినిమా చేస్తాడా ? లేదా మరో సినిమా కూడా చేశాక త్రివిక్రమ్ తో జాయిన్ అవుతారా ? తెలియాలి. త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics