Akshara Movie is ready for release

Saturday,January 02,2021 - 01:19 by Z_CLU

నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన Akshara సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. లాక్ డౌన్ కారణగా రిలీజ్ వరకూ వచ్చి వాయిదా పడిన ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

సినిమా థీం తెలియజేసేలా కాన్సెప్ట్ పోస్టర్ డిజైన్ చేసి ఫిబ్రవరిలో థియేటర్స్ లో విడుదల అంటూ తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ ను అడివి శేష్ లాంచ్ చేసి సోషల్ మీడియాలో సినిమాపై బజ్ తీసుకొచ్చాడు.

విద్యారంగంలో జరుగుతున్న అవినీతి పై మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాకు చిన్ని దర్శకుడు. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ వర్మ , అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. మరి ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.