Akkineni Nagachaitanya speech at Custody PreRelease Event

Monday,May 08,2023 - 04:11 by Z_CLU

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తుండగా ,శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ,ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు. జోష్ సినిమా ఆడియో లాంచ్ లో వెంకీ మామ సౌండ్ అంటే ఇలా ఉంటుందని అభిమానులను ఉద్దేశించి చెప్పారు. ఆ సౌండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గలేదు. కస్టడీ కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు లేచి ఆయన్ని గట్టిగా హాగ్ చేసుకున్నాను. నాకు అంత ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది. వెంకట్ ప్రభు గారికి థాంక్స్. తమిళ్  లో  ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ లో కూర్చోబెట్టారు. నా కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ఇది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అరవింద్ స్వామి గారు ఈ కథ కి ఓకే చెప్పడంతో మా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. శరత్ కుమార్ గారికి,  నాకు చాలా యూనిక్ యాక్షన్ డిజైన్ చేశారు. ప్రియమణి గారు తన పాత్రకు చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. అబ్బూరి రవి గారు పవర్ ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. డీవోపీ కతీర్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ , రామజోగయ్య శాస్త్రి గారికి, యాక్షన్ మాస్టర్స్ మహేష్, స్టంట్ శివ,  డ్యాన్స్ మాస్టర్స్, మా పీఆర్వోలు వంశీ శేఖర్ కి థాంక్స్. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారి సంగీతం బ్లాక్ బస్టర్. థియేటర్ లో నేపధ్య సంగీతం ఒక రచ్చె. థియేటర్ లో ఒక మ్యాజిక్ చూపిస్తారు. సినిమా మొదటి ఇరవై నిమిషాలు కూల్ గా వెళుతుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు వుంటాయి. మీరు కొత్త చై ని చూడబోతున్నారు. వెంకట్ ప్రభుగారు అలా డిజైన్ చేశారు. మీ అందరూ నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మే 12న అందరం థియేటర్ లో కలుద్దాం. లవ్ యూ  ఆల్’’ అన్నారు.