Akhil Movie with Srinu Vaitla

Thursday,July 01,2021 - 07:45 by Z_CLU

అక్కినేని కుటుంబం నుండి హీరోగా పరిచయమైన నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా మూడు సినిమాలు చేశాడు.  ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని యంగ్ హీరో నెక్స్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే స్టైలిష్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత చేయబోయే #Akhil6 సినిమాను కూడా లైన్లో పెట్టుకున్నాడట అఖిల్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తన ఆరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇటివలే అఖిల్ కి ఓ యూత్ ఫుల్ కథను వినిపించాడట వైట్ల. ఫైనల్ నరేషన్ బ్యాలెన్స్ ఉందట. ఆ నరేషన్ పూర్తయి అఖిల్ కి కథ నచ్చితే ఈ కాంబో సెట్స్ పైకి వచ్చేస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. అఖిల్ కి అప్పుడెప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు నిర్మాతలు.

srinu-vaitla-zee-cinemalu

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నాడు. ఇక శ్రీను వైట్ల కూడా మంచు విష్ణు తో 'డీ అండ్ డీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే అఖిల్ , శ్రీను వైట్ల కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి వరుసగా ఎష్టాబిలేష్ డైరెక్టర్స్ తో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న అఖిల్ ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics