Akhil and Surender Reddy film Under AK Entertainments

Wednesday,September 09,2020 - 10:16 by Z_CLU

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ చాన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ పై ఈరోజు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. Akhil-Surender Reddy కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. కెరీర్ లో అఖిల్ కు ఇది ఐదో సినిమా.

AK Entertainments బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

సైరా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు సురేందర్ రెడ్డి. ఎట్టకేలకు అఖిల్ తో సినిమా ప్రకటించాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించాడు. వక్కంతం-సురేందర్ కాంబోలో ఇంతకుముందు రేసుగుర్రం, కిక్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ కోసం కలిసింది ఈ హిట్ కాంబినేషన్. #Akhil5 కు సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.