Akhil Agent Movie to release on Sankranthi

Monday,October 24,2022 - 03:42 by Z_CLU

Akhil Agent Movie to release on Sankranthi

'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ ఆల్రెడీ రిలీజై, మంచి రెస్పాన్స్ రాబట్టింది.

శివ కార్తికేయన్, కిచ్చా సుదీప్ కలిసి తమిళం, కన్నడ భాషలలో 'ఏజెంట్' టీజర్‌ను లాంచ్ చేయగా.. మలయాళం వెర్షన్ టీజర్ ను మమ్ముట్టి విడుదల చేశారు. హిందీ వెర్షన్ టీజర్ కూడా విడుదలైంది.

తాజాగా ఏజెంట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేసి, సంక్రాంతికి సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. అఖిల్ కు ఇదే తొలి సంక్రాంతి మూవీ.

రసూల్ ఎల్లోర్ ఏజెంట్ వరల్డ్ ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. ఇక హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై ఈ మూవీ వస్తోంది.

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తోంది ఏజెంట్. ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు పరిచయమౌతోంది.