Akhanda Movie release date almost fix

Thursday,June 24,2021 - 01:53 by Z_CLU

బాలయ్య అఖండ సినిమా ఎప్పుడొస్తుంది ? అనే ప్రశ్నలకు త్వరలోనే ఫులి స్టాప్ పడనుంది. మొన్నటి వరకు ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా రానుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో డేట్ తెరపైకి వచ్చింది. అవును సినిమాకు సంబంధించి ఇటివలే ఓ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడట బాలయ్య. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటీకే టీంకి ఈ డేట్ చెప్తూ నెక్స్ట్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. అఖండ కి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైనల్ షెడ్యుల్ లో కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది.

ఆ సీన్స్ కంప్లీట్ చేసేస్తే సినిమా టోటల్ షూట్ పూర్తవుతుంది. అందుకే సెప్టెంబర్ 10 న రిలీజ్ అని ఓ టార్గెట్ పెట్టుకొని టీం షెడ్యుల్ ప్లాన్ చేసుకుంటున్నారట. జులై నుండి సినిమా ఆఖరి షెడ్యుల్ మొదలు కానుందని సమాచారం. ఈ లోపు పాటలు , ట్రైలర్ తో హంగామా చేసేందుకు ప్రమోషన్ ప్లాన్ కూడా రెడీ అవుతుందట. ఆగస్ట్ నుండి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. అప్పటి నుండి సెప్టెంబర్ రిలీజ్ వరకు బాలయ్య సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

ద్వారాక క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సరసన పూర్ణ , ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై శ్రీకాంత్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. లెజెండ్ తో జగపతి బాబు ని పవర్ ఫుల్ విలన్ గా మార్చిన బోయపాటి తనను కూడా అదే రేంజ్ లో చూపించి విలన్ గా మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెదతాడని భావిస్తున్నాడు. బాలయ్య -బోయపాటి కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics