Aishwarya Rajesh in Sai tej Deva Katta Movie

Saturday,October 31,2020 - 05:13 by Z_CLU

ఇటివలే Solo Brathuke So Better సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన Sai Dharam Tej ప్రస్తుతం DevaKatta దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు Nivetha Pethuraj ను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ ప్లేస్ లో ఐశ్వర్య రాజేష్ ను రీప్లేస్ చేసారు. ఈ సినిమాలో SaiTej సరసన Aishwarya Rajesh హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటివలే హైదరాబాద్ శివార్లలోని తెల్లాపూర్ లో కొన్ని రోజులు షూట్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమీర్ పేట్ లో షూటింగ్ జరుగుతుంది. సాయి ధరం తేజ్ , ఐశ్వర్య రాజేష్ లతో పాటు మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. Bhagavan-Pullarao నిర్మిస్తున్న ఈ సినిమాకు Manisharma మ్యూజిక్ అందిస్తున్నాడు.