After Vikram Success Whats Kamal Haasan’s next ? 

Monday,June 13,2022 - 05:21 by Z_CLU

కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత 'విక్రమ్' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ అంశాలతో తెరకెక్కిన యాక్షన్ డ్రామాతో తమిళ్ , తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం నటుడిగా , నిర్మాతగా 'విక్రమ్'  సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వచ్చి థాంక్స్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు థాంక్యూ చెప్పుకున్నారు కమల్ .

అయితే విక్రమ్ తర్వాత కమల్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అవును ఈ సినిమా తర్వాత కమల్ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. పక్కన పెట్టేసిన 'శభాష్ నాయుడు' ను కమల్ ఇప్పుడు సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి కమల్ హాసనే డైరెక్టర్. భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో కమల్ ఆ సినిమాను పక్కన పెట్టేశారని ఓ టాక్ ఉంది. మళ్ళీ ఇప్పుడు విక్రమ్ తో నిర్మాతగా లాభాలు అందుకున్నారు కాబట్టి త్వరలోనే శభాష్ నాయుడు ని ఫినిష్ చేస్తారని చెన్నై టాక్.

ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ 'భారతీయుడు 2' మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ స్టేజిలో ఆగిపోయింది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో RC15 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను కంప్లీట్ చేసి కమల్ 'భారతీయుడు 2' ని పూర్తి చేస్తాడు. 'విక్రమ్' తర్వాత కమల్ చేయబోయే సినిమాలు ఇవే. మరి శభాష్ నాయుడు తో కమల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తారో చూడాలి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics