After ‘Salaar’ what’s Prashanth Neel plan ?

Saturday,April 03,2021 - 12:40 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో 'సలార్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రశాంత్ నెక్స్ట్ సినిమా హీరో ఎవరు ? అనే డిస్కషన్ నడుస్తుంది. నిజానికి ప్రశాంత్ ప్రభాస్ కంటే ముందే ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ సెట్ అయ్యే సమయానికి కరోనా ఎంటరవ్వడం, తర్వాత లాక్ డౌన్ పెట్టడం దీంతో RRR షూటింగ్ ఆలస్యం అవ్వడం చక చకా జరిగిపోయి ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది.

ఇక ప్రశాంత్ బన్నీ కి కూడా ఒక కథ వినిపించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే కొరటాల శివ తర్వాత అల్లు అర్జున్ సినిమా ప్రశాంత్ తోనే అనే టాక్ నడుస్తుంది. మరి సలార్ తర్వాత ప్రశాంత్ బన్నీ తో సినిమా చేస్తాడా ? లేదా తారక్ సినిమాను ముందు సెట్స్ పై పెడతాడా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ తెలియాలంటే సలార్ షూటింగ్ ఓ కొలిక్కి రావాలి. అప్పటి వరకు దీని పై క్లారిటీ రాదు.