Actress Shriya Saran blessed with baby girl in 2020

Tuesday,October 12,2021 - 03:58 by Z_CLU

ఇది అలాంటిలాంటి షాకింగ్ న్యూస్ కాదు. ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వాళ్లను చూశాం. సీక్రెట్ గా ప్రేమించుకున్న వాళ్లను చూశాం. కానీ సీక్రెట్ గా బిడ్డను కన్న హీరోయిన్లను ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. అవును.. శ్రియ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఏడాది కిందట.

షాకింగ్ గా అనిపించినా ఇది వాస్తవం. లాక్ డౌన్ టైమ్ లో తను గర్భం దాల్చానని, ఆడబిడ్డకు జన్మనిచ్చానని స్వయంగా శ్రియ వెల్లడించింది. ఏడాది వయసున్న పాపతో ఆడుకుంటున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో షాక్ అవ్వడం జనాల వంతు అయింది.

https://www.instagram.com/p/CU5GnpSsaSB/

శ్రియ చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకుంటుందనే విషయం వారం ముందు వరకు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత బార్సిలోనాలో కాపురం పెట్టింది. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో అక్కడే ఉండిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూనే ఉంది. కానీ ఇలా ప్రెగ్నెంట్ అయి, బిడ్డకు జన్మనిచ్చినట్టు ఎక్కడా చెప్పలేదు. కనీసం హింట్స్ కూడా వదల్లేదు.

'2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ కారణం‍గా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను' అంటూ సోషల్ మీడియాలో తను తల్లి అయిన విషయాన్ని బయటపెట్టింది శ్రియ.

shriya pregnancy

ఈమధ్య శ్రియ-ఆండ్రీ కొశ్చేవ్ దంపతులు ఇండియాకొచ్చారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉంటున్నారు. శ్రియ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన గమనం సినిమా విడుదలకు సిద్ధమైంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics