Actress Anita blessed with Baby Boy

Wednesday,February 10,2021 - 12:58 by Z_CLU

తెలుగులో నువ్వు-నేను సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది హీరోయిన్ అనిత. పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడీమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మగబిడ్డకు జన్మనిచ్చింది అనిత.

తనకు బాబు పుట్టిన విషయాన్ని అనిత భర్త, రోహిత్ రెడ్డి స్వయంగా ఎనౌన్స్ చేశాడు. ఇనస్టాగ్రామ్ లో అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

భర్తతో కలిసి గోవా ట్రిప్ లో ఉన్నప్పుడు లాక్ డౌన్ టైమ్ లో ప్రెగ్నెంట్ అయింది అనిత. అప్పటికే ఆమెకు పెళ్లయి ఏడేళ్లయింది. అలా 39 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది.

బాబు పుడితే వాడికి రవి అనే పేరు పెట్టాలని ఈ జంట ముందే ఫిక్స్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా రోహిత్ రెడ్డి తండ్రి రవి మరణించారు. అందుకే కొడుకు పుడితే రవి అనే పేరు పెట్టాలనుకున్నారు.