Acharya song details

Friday,March 05,2021 - 01:16 by Z_CLU

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆచార్య. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ పెద్ద హిట్టయింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి మరో ఇంపార్టెంట్ ఎలిమెంట్ బయటకొచ్చింది

ఆచార్యలో చిరంజీవికి 2 పాటలున్నాయి. ఒక పాట రెజీనాతో. ఇంకో పాట హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో. ఇక రామ్ చరణ్ కు కూడా 2 పాటలున్నాయి. ఒక పాట హీరోయిన్ పూజా హెగ్డేతో కాగా.. ఇంకోపాట చరణ్-చిరంజీవి కాంబినేషన్ లో వస్తుంది.

ఇవి కాకుండా సినిమాలో మరో 2 సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇక మరోపాట శివుడిపై ఉంది.

ఇక ఇంట్రో సీన్స్ విషయానికొస్తే.. చిరంజీవి ఇంట్రో సీన్, చరణ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మేజర్ ఎస్సెట్స్ గా చెబుతున్నారు. మే 13న ఆచార్య సినిమా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది.