Acharya second single Neelambari releasing on Nov 5th

Wednesday,November 03,2021 - 12:53 by Z_CLU

ఆచార్య సినిమా ఈ ఏడాది విడుదల కాదు. సంక్రాంతికి కూడా సినిమా రాదు. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్ జోరు కూడా తగ్గించారు. లెక్కప్రకారం ఈపాటికే 3 సింగిల్స్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో నిదానంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చారు.

ఆచార్య సినిమా నుంచి లాహె..లాహె సాంగ్ రిలీజై చాలా రోజులైంది. యూట్యూబ్ రికార్డులు తిరగరాయడంతో పాటు, అందర్నీ బాగానే ఆకట్టుకుంది ఆ పాట. మణిశర్మ కంపోజిషన్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, చిరంజీవి-సంగీత స్టెప్పులు అందర్నీ అలరించాయి. ఇప్పుడు రెండో పాటను 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో కనిపించనుంది పూజా హెగ్డే. ఆమె క్యారెక్టర్ పేరు మీదనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. నీలాంబరి లిరిక్స్ తో సాగే ఈ పాటకు మణిశర్మ అద్భుతమైన బాణీలిచ్చాడట. ఈ సాంగ్ తో అతడికున్న మెలొడీ బ్రహ్మ ఇమేజ్ మరింత పెరుగుతుందంటున్నారు. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రాబోతోంది ఆచార్య.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో  భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది ఆచార్య. ఈ సినిమాలో సిద్ధ అనే కీలకమైన పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics