Acharya resumes shoot from Nov 9

Wednesday,November 04,2020 - 02:34 by Z_CLU

కరోనా/లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన Acharya సినిమా షూటింగ్ మళ్లీ మొదలుకాబోతోంది. ఈ మూవీ సెట్స్ పైకి వచ్చే తేదీని Chiranjeevi ఫిక్స్ చేశారు. నవంబర్ 9 నుంచి ఆచార్య మూవీ మళ్లీ సెట్స్ పైకి రాబోతోంది.

స్టార్ట్ చేయడమే భారీ షెడ్యూల్ తో ఆచార్య మూవీని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. చిరంజీవితో పాటు, రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కాజల్ కూడా సెట్స్ పైకి రాబోతోంది.

ఈ సందర్భంగా Acharya Release పై కూడా క్లారిటీ ఇచ్చింది యూనిట్. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఆచార్య మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతడు ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తాడనేది ఇంకా క్లారిటీ రాలేదు.

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా కనిపించనుంది.