Acharya misses Sankranthi 2020

Wednesday,September 23,2020 - 01:56 by Z_CLU

ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటం సహజమే. అదే సీజన్ కి MegaStar సినిమా రిలీజ్ అయితే మాత్రం హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతాయి. Khaidi150 వసూలు చేసిన లెక్కలే దీనికి ఉదాహరణ.

అయితే వచ్చే సంక్రాంతి కి Acharya థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే మెగా ఫ్యాన్స్ ను సంబరపడేలా చేస్తుంది. అవును సోషల్ మీడియాలో Chiranjeevi బొమ్మ సంక్రాంతి కి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు.

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ఆచార్య ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడి రిలీజ్ ఎప్పుడో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందీ సినిమా. ప్రస్తుతం సంక్రాంతి ని రీచ్ అవ్వడానికి మేకర్స్ చేతిలో కేవలం మూడు నెలలే ఉన్నాయి. ఇంకా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కనుక సంక్రాంతి సీజన్ ను ఆచార్య మిస్ చేసుకున్నట్లే.

ఇక ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు.