500M digital views for Rara Reddy song from Macherla Niyojika Vargam

Tuesday,August 09,2022 - 03:33 by Z_CLU

500M digital views for Rara Reddy song from Macherla Niyojika Vargam

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎస్ ఆర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మాచర్ల నియోజిక వర్గం' లో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. రిలీజ్ కి ముందే సాంగ్స్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఆల్బంలో ఉన్న మాస్ సాంగ్ 'రారా రెడ్డి' అయితే మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాకి షేక్ చేస్తోంది. జయం సినిమాలో రాను రాను సాంగ్ కి రీమిక్స్ గా సాగర్ మహతి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఓవరాల్ గా డిజిటల్ లో 500 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది.

ప్రస్తుతం యూ ట్యూబ్ , ఇన్స్టాల్లో సాంగ్ దుమ్ము దులుపుతూ కొనసాగుతుంది. యూ ట్యూబ్ లో తాజాగా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 50 మిలియన్ వ్యూస్ వైపుకు పరిగెడుతుంది. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవ్వనుందని విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ కి పూనకం తెప్పించడం ఖాయమనిపిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ హై ఎనర్జిటిక్ మాస్ నంబర్ కి అదిరిపోయే లిరిక్స్ అందించి సాంగ్ కి ఎనర్జీ తీసుకొచ్చాడు కాసర్ల శ్యామ్. లిప్సిక సింగింగ్ కూడా సాంగ్ కి బాగా కలిసొచ్చింది. ఓవరాల్ గా భారీ వ్యూస్ తో ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ సాంగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

శ్రేష్ట్ మూవీస్ బేనర్ పై సుధాకర్ రెడ్డి , నిఖిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics