3 Movies updates from Raviteja

Tuesday,January 25,2022 - 08:20 by Z_CLU

రేపు మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు. ఈ ఏడాది రవితేజ కి స్పెషల్ బర్త్ డే అని చెప్పొచ్చు. 'క్రాక్' లాంటి బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ మీదున్నాడు రవితేజ. జెట్ స్పీడులో మూడు సినిమాలు చేస్తున్నాడు. నెలల గ్యాప్ లో మూడు సినిమాలతో ఈ ఏడాది థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. రేపు రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమాల నుండి వరుసగా అప్ డేట్స్ రానున్నాయి.

ముందుగా 'ఖిలాడీ' సినిమా నుండి రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు టీం. ఉదయం 10 : 08 నిమిషాలకు "ఫుల్ కిక్" అనే సాంగ్ రిలీజ్ అవ్వనుంది. ఆ వెంటనే 12 : 06 "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా నుండి టీజర్ రాబోతుంది. సాయంత్రం 4 : 05 నిమిషాలకు ధమాకా సినిమా నుండి రవితేజకి విషెస్ చెప్తూ ఓ పోస్టర్ రానుందని సమాచారం.

ఇలా వరుసగా మూడు అప్ డేట్స్ తో రేపు మాస్ మహారాజా బర్త్ డే ఫ్యాన్స్ కి స్పెషల్ డే అవ్వనుంది. ఈ మూడు అప్ డేట్స్ తో పాటు 'రావణాసుర' టీం నుండి బర్త్ డే విషెస్ పోస్టర్ కూడా రానుందని తెలుస్తుంది. ఇలా రేపు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో మాస్ మహారాజా హంగామా చేయనున్నాడు.