2nd Single ‘SatyamevaJayathe’ from Vakeelsaab out now !

Wednesday,March 03,2021 - 06:19 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'  మొదటి సాంగ్ 'మగువా' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో సాంగ్ రిలీజైంది. 'సత్యమేవ జయతే' అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ మిలియన్ వ్యూస్ వైపు దూసుకెళ్తుంది.

తమన్ కంపోజ్ చేసిన పవర్ ఫుల్ ట్యూన్ కి అంతే పవర్ ఫుల్ లిరిక్స్ అందించాడు రామజోగయ్య శాస్త్రి. ముఖ్యంగా "ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలు...గొంతెత్తి ప్రశ్నించాడో అంతా నిశ్చింతే" లాంటి లైన్స్  సాంగ్ కి మరింత బలం చేకూర్చాయి. శంకర్ మహదేవన్ వాయిస్ సాంగ్ కి మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఓవరాల్ గా ఈ సాంగ్ సినిమాలో హైలైట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

బోణీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి రానుంది.