2022 Year End Special – Super Hit Songs (Part-2)

Thursday,December 15,2022 - 04:32 by Z_CLU

ఈ ఏడాది రిలీజైన సూపర్ హిట్ సాంగ్స్ గురించి 2022 రౌండప్ లో భాగంగా పార్ట్ 2. మరి సెకండాఫ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.

2022 లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది 'సీతా రామం'.  దుల్కర్ , మృణాళిని జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ క్లాసిక్ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అనిపించుకొని చార్ట్ బస్టర్ లిస్టులో చేరాయి. ముఖ్యంగా ఆల్బంలో "ఓ సీతా" సాంగ్ తో పాటు "ఇంతందం" సాంగ్ కూడా మోస్ట్ పాపులర్ అనిపించుకున్నాయి. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ కి  అనంత్ శ్రీరాం, కృష్ణ కాంత్ అద్భుతమైన సాహిత్యం అందించారు.  ఏడాది మ్యూజిక్ లవర్స్ ఎక్కువగా విన్న ఆల్బమ్స్ లో 'సీతా రామం' టాప్ లో ఉంది.

అనిరుద్ నుండి ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ సాంగ్స్ లో హలమిత్తి హబిబో సాంగ్ ఫస్ట్ ప్లేస్ అందుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఈ సాంగ్ ఫేవరేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఏడాది భారీ సంఖ్యలో రీల్స్ చేసిన సాంగ్ కూడా ఇదే. ఆల్మోస్ట్ ఈ ఇయర్ జరిగిన అన్ని ఈవెంట్స్ లో ఈ సాంగ్ వినిపించింది. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఈ ఇయర్ సెన్సేషనల్ సాంగ్ అనిపించుకుంది.

ఈ ఇయర్ యూత్ కి బాగా కనెక్ట్ అయిన లవ్ సాంగ్స్ లో "గుండెల్లోన" ఒకటి. ఓరి దేవుడా సినిమాలోని ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఇంప్రెస్ చేసింది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కాశర్ల శ్యాం అందించిన లిరిక్స్ ప్లస్ అయ్యాయి. అనిరుద్ సింగింగ్ తో సాంగ్ గట్టిగా రీచ్ అయ్యింది. ఫైనల్ గా 2022 బెస్ట్ లవ్ సాంగ్స్ లిస్టులో అలవోకగా చేరిపోయింది.

క్లాస్ సాంగ్స్ ఎన్ని వచ్చినా మాస్ సాంగ్ కి ఉండే  క్రేజ్ వేరు. ఈ ఏడాది 'మాచెర్ల నియోజక వర్గం'లో "రారా రెడ్డి" సాంగ్ మోస్ట్ ఫేవరేట్ మాస్ సాంగ్ గా నిలిచింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కాశర్ల శ్యాం అందించిన మాస్ లిరిక్స్ బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా ఈ సాంగ్ లో జయంలో మోస్ట్ పాపులర్ సాంగయిన రాను రాను అంటూనే చిన్నదో మిక్స్ చేయడం సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి బెస్ట్ సాంగ్ గా తీర్చిదిద్దింది. లిప్సిక వోకల్ కూడా సాంగ్ కి బిగ్ ప్లస్ అయింది.

కొన్ని లవ్ సాంగ్స్ రిలీజయ్యాక సినిమా మీద అంచనాలు పెంచుతాయి. కానీ కొన్ని సాంగ్ మాత్రం రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అవుతుంటాయి. తిరు ఆల్బం లో  "నా మది పూవది" ఆ కోవలోకే వస్తుంది. తెలుగులో డబ్బింగ్ సినిమాగా రిలీజైన ఈ ఆల్బంలో ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి మోస్ట్ ఫేవరేట్ సాంగ్ అయిపోయింది.

'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి , సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కూడా ఈ ఇయర్ పాపులర్ సాంగ్స్ లో చోటు దక్కించుకుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రిలీజ్ కి ముందు సినిమాపై భారీ అంచనాలు పెంచడంలో ఈ సాంగ్ కీలక పాత్ర పోషించింది. అనంత్ శ్రీరాం లిరిక్స్ అందించిన ఈ సాంగ్ శ్రేయా ఘోషల్ పాడటంతో ఇంకా ఎక్కువ రీచ్ అయ్యింది.

లైగర్ ఆల్బం లో ఫస్ట్ సింగిల్ గా రిలీజైన అక్డి పకడీ సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. లిరిక్స్ అర్థం కాకపోయినా లిజో జార్జ్ , డీజే చేతన్ కంపోజ్ చేసిన ఫాస్ట్ బీట్ ట్యూన్ మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో 'ధమాకా' సినిమా కోసం కంపోజ్ జింతాక్ జింతాక్ సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ మాస్ సాంగ్స్ లో ప్లేస్ అందుకుంది. భీమ్స్ ఎనర్జిటిక్ ట్యూన్ కి కాశర్ల శ్యాం అంతే ఎనర్జిటిక్ లిరిక్స్ అందించాడు. అలాగే మంగ్లీ వోకల్ ఎనర్జీ కూడా ఈ సాంగ్ కి కలిసొచ్చింది. ఈ ముగ్గురి కాంబో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ భారీ వ్యూస్ కొల్లగొడుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

 

ఈ ఏడాది చివర్లో మ్యూజిక్ డైరెక్టర్  గోపి సుందర్ కూడా మ్యూజిక్ లవర్స్ కి 18 పేజిస్ ఆల్బం ద్వారా మంచి ఎనర్జీ సాంగ్ అందించాడు. శింబు పాడిన టైం ఇవ్వు పిల్ల సాంగ్ తక్కువ టైంలో బాగా రీచ్ అయింది. అలాగే ఈ ఆల్బంలో నన్నయ్య రాసిన , ఏడు రంగుల వాన పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఓవరాల్ గా 18 పేజిస్ ఆల్బం ప్లీసెంట్ మ్యూజిక్ తో ఈ ఏడాదికి పర్ఫెక్ట్ మంచి ఎండింగ్ ఇచ్చింది.