2022 Tollywood Upcoming Attractions

Saturday,January 01,2022 - 10:00 by Z_CLU

గతేడాది కొన్ని బడా సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకొని టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాయి. అయితే ఆ సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఏడాది టాలీవుడ్లో భారీ సినిమాలన్నీ క్యూ కట్టేశాయి. లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి రాలేకపోయిన స్టార్ హీరోలు ఈ ఏడాది ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి 2022 రాబోయే భారీ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

 RRR

ఈ ఇయర్ మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లిస్టులో  టాప్ ప్లేస్ నిలిచింది RRR. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్లు అమ్మకాలు జరిగిపోయాయి. రిలీజ్ కి ముందే అక్కడ టికెట్ల సేల్స్ తో భారీ రికార్డు కూడా నమోదైంది. నాటు నాటు సాంగ్, ట్రైలర్ , జక్కన్న ప్రమోషన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసి ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై కొమురం భీమ్ , అల్లూరి సీతారామరాజులను చూస్తామా ? అని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

 

చాన్నాళ్ళ తర్వాత ప్రభాస్ 'రాధే శ్యామ్' తో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 14 న సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసి ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలియజేశాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ప్రభాస్ నుండి 'సలార్' కూడా ఈ ఏడాదే రాబోతుంది.  ప్రశాంత్ నీల్ -ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఉంది. అలాగే ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తున్న 'ఆది పురుష్' కూడా ఇదే ఏడాది ఆగస్ట్ లో థియేటర్స్ లోకి రానుంది.

 Bangarraju-release-zeecinemalu

నాగార్జున , నాగ చైతన్య కాంబినేషన్ లో విలేజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'బంగార్రాజు' సినిమా కూడా ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృతి శెట్టి , రమ్య కృష్ణ ఫీమేల్ లీడ్స్ లో కనిపించనున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. 'సోగ్గాడే చిన్ని నాయన' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 Acharya release zeecinemalu

'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' ఈ ఏడాది ఫిబ్రవరి 4న  విడుదలవుతోంది. చిరు తో కలిసి చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమా కోసం ఇటు మెగా అభిమానులు అటు సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పైగా మణిశర్మ సాంగ్స్ కూడా సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. కొరటాల మెగా స్టార్ ని మెగా పవర్ స్టార్ ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో అన్న సందేహాలతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది. మెగాస్టార్ నుండి ఈ ఏడాది మరో సినిమా కూడా వచ్చే చాన్స్ ఉంది. 'గాడ్ ఫాదర్' ని దసరా కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

'భీమ్లా నాయక్' తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ముందుగా సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25 కి షిఫ్ట్ అయింది. పవర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న పక్కా మాస్ సినిమా అవ్వడంతో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా రానా డానియల్ అనే క్యారెక్టర్ చేస్తుండటంతో రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ అయింది.  సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకేక్కుతునన్ ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్, మాటలు అందిస్తుండటం విశేషం. ఈ సినిమాతో పటు క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

 sarkaruvaaripaata-release-zeecinemalu

లాస్ట్ ఇయర్ గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ ఇయర్  'సర్కారు వారి పాట' తో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ - పరశురాం కాంబినేషన్ లో మొదటి సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన టీజర్ , అలాగే పోకిరి మ్యాచ్ చేసే ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని చెప్తున్న మహేష్ మాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.

 F3

2019 సంక్రాంతి స్పెషల్ గా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'F2' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'F3' ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదలవుతోంది. F2 లో భార్య భర్తల మధ్య గొడవలతో ఎంటర్టైన్ చేసిన అనిల్ రావిపూడి ఈసారి సీక్వెల్ లో ఫైనాన్షియల్ అంశాన్ని తీసుకున్నాడు. డబ్బు లింకుతో ఈసారి ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అని కామెడీ ప్రియులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

kgf-chapter2-release-zeecinemalu

ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా సినిమాల్లో KGF చాప్టర్ 2 ఒకటి.  యష్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన KGF అన్ని భాషల్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా తెలుగు , హిందీ భాషల్లో భారీ వసూళ్ళు అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ లేదా మార్చ్ లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' కి సీక్వెల్ తెరకెక్కనున్న 'పుష్ప 2' కూడా ఇదే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. 2021 కి భారీ కలెక్షన్స్ తో ఎండ్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ ఏడాది అదే తేదికి మళ్ళీ పుష్ప పార్ట్ 2 రావాలని చూస్తున్నాడు. మార్చ్ నుండి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా డిసెంబర్ 17 రిలీజ్ టార్గెట్ గా పూర్తి కానుంది. 

ఈ ఏడాది క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాల లిస్టులో 'లైగర్' కూడా ఉంది. పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 25 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది.

మాస్ మహారాజా రవితేజ నుండి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. రమేష్ వర్మ డైరెక్షన్ లో  డ్యుయల్ రోల్లో నటిస్తున్న 'ఖిలాడి' సినిమా, అలాగే కొత్త దర్శకుడు శరత్ తో చేస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ'  , త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో నటిస్తున్న 'ధమాకా' సినిమాలు ఒకే ఏడాదిలో రానున్నాయి.

 బడా సినిమాలతో పాటు ఈ ఇయర్  వరుణ్ తేజ్ 'గని' నాని 'అంటే సుందరానికి', 'దసరా' , కళ్యాణ్ రామ్ 'బింభి సార', నాగ చైతన్య 'థాంక్యూ', నితిన్ 'మాచెర్ల నియోజిక వర్గం'  నిఖిల్ '18 పేజెస్', సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ సినిమాలతో పాటు మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా సందడి చేయనున్నాయి.

 Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics