2021 Year End Special : Best Movies

Wednesday,December 29,2021 - 05:11 by Z_CLU

ప్రతీ ఏడాది కొన్ని సినిమాలు ఆడియన్స్ ని మెప్పించి బెస్ట్ ఫిలిమ్స్ అనిపించుకుంటాయి. మరి ఈ ఏడాది  బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి  సక్సెస్ అందుకున్న బెస్ట్ ఫిలిమ్స్ లిస్టు చూద్దాం.

VAKEEL-Saab-Akhanda-Pushpa-2021-best-movies-zeecinemalu

పవన్ కళ్యాణ్ కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత  రీ ఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్ మంచి విజయం సాధించి బెస్ట్ ఫిలిమ్స్ లిస్టులో నిలిచింది. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినప్పటికీ దర్శకుడు చేసిన మార్పులు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెంట్స్ , వేణు శ్రీరామ్ టేకింగ్ , తమన్ మ్యూజిక్ , కాన్సెప్ట్ ఇలా అన్నీ వర్కౌట్ అవ్వడంతో సినిమా మేజిక్ క్రియేట్ చేసింది.

'అఖండ'తో ఈ ఏడాది ప్రేక్షకులకు బెస్ట్ ఫిలిం అందించాడు నందమూరి బాలకృష్ణ. రెండు పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా బోయపాటి బాలయ్యని అఘోరగా ప్రెజెంట్ చేసిన తీరు, యాక్షన్ ఎపిసోడ్స్ 'అఖండ' ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఓవరాల్ గా సెకండ్ వేవ్ తర్వాత భారీ సినిమాలకు మంచి ఉత్సాహం ఇచ్చిన బడా సినిమాల్లో 'అఖండ' ముందు స్థానంలో నిలిచింది.

అల్లు -అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప ది రైజ్' ఈ ఇయర్ ని భారీ కలెక్షన్స్ తో పర్ఫెక్ట్ ఎండ్ ఇచ్చింది. పుష్పరాజ్ గా బన్నీ నటన , సుకుమార్ నేచురల్ టేకింగ్ , దేవి మ్యూజిక్ సినిమాను పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసాయి. ఫైనల్ గా సినిమా అన్ని భాషల్లో సక్సెస్ సాధించి తెలుగు సినిమా గురించి మరోసారి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

Krack-uppena-jathiratnalu-2021-best-movies-zeecinemalu

ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన 'క్రాక్' ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్స్ వైపు చూసేలా చేసింది. రవితేజ మాస్ క్యారెక్టర్ , గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ , వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ ఇలా అన్నీ కలిపి ఈ ఏడాది ఆడియన్స్ కి 'క్రాక్' మాస్ బిర్యానీ అందించింది.

ఈ ఇయర్ హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ తో భారీ వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది 'జాతి రత్నాలు'. నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో నవ్వుల పూవులు పూయించి కాసుల వర్షం కురిపించింది. ఫైనల్ గా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఎవరూ ఊహించని విధంగా ఓ చిన్న సినిమాగా రిలీజై డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది 'ఉప్పెన'. దర్శకుడు బుచ్చి బాబు దర్శకుడిగా , వైష్ణవ్ -కృతి శెట్టి హీరో హీరోయిన్ గా పరిచయమైన ఈ ప్రేమకథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో భారీ కలెక్షన్స్ అందించి ఉప్పెన ని పెద్ద హిట్ చేశారు.

నాగ చైతన్య - సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తీసిన 'లవ్ స్టోరి' కూడా ఈ ఇయర్ మంచి హిట్ సాధించి ప్రేక్షకులను మెప్పించింది. సమాజంలో అక్కడక్కడా జరుగుతున్న ఓ తప్పుని కథా వస్తువుగా ఎంచుకొని దాని చుట్టూ ఓ మంచి ప్రేమకథను అల్లి ఆకట్టుకున్నాడు శేఖర్ కమ్ముల.

ఇయర్ ఎండింగ్ లో వచ్చిన నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా నాని కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ లో శ్యామ్ సింగ రాయ్ ఒకటిగా నిలిచింది. హసిత్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ  శ్రీ విష్ణు నటించిన 'రాజ రాజ చోర' హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా పరంగా దర్శకుడు హసిత్ కి మంచి గుర్తింపు లభించింది. అల్లరి నరేష్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసి విజయ్ కనకమేడల తీసిన 'నాంది' కూడా ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకుంది. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.

ఈ ఏడాది రామ్ -  'రెడ్' , ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన 'జాంబి రెడ్డి' , కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' , రోషన్  'పెళ్లి సందడి , ప్రదీప్  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా',  సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలు అందుకున్నాయి. అఖిల్ -బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా  మంచి సక్సెస్ అందుకొని డీసెంట్ హిట్ సాధించింది. సాగర్ హీరోగా తెరకెక్కిన 'షాదీ ముబారక్' క్లీన్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. సుదీర్ బాబు , కరుణ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' కంటెంట్ పరంగా మంచి సినిమా అనిపించుకుంది.

ఈ ఇయర్ రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ లో సందడి చేశాయి. సూపర్ స్టార్ రజినీ కాంత్ 'పెద్దన్న', విజయ్ 'మాస్టర్' , శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్'  సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడాయి. అలాగే OTT లో విడుదలైన 'నారప్ప', 'జై భీమ్','దృశ్యం 2', 'అద్భుతం', 'ఏక మినీ కథ' సినిమాలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి మంచి వ్యూస్ కొల్లగొట్టాయి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics