2021 Year End Special : Best Actors

Tuesday,December 28,2021 - 04:53 by Z_CLU

ఈ ఏడాది పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో చాలా మంది హీరోలు మెస్మరైజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ లిస్టులో స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలు కూడా చేరి వారి నటనతో మెప్పించి ఆకట్టుకున్నారు. మరి ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్స్ కేటగిరీ పై ఓ లుక్కేద్దాం.

అల్లుఅర్జున్ (పుష్ప)

ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ లిస్టు లో టాప్ ప్లేస్ అద్నుకున్నాడు బన్నీ. పుష్ప రాజ్ గా అదుర్స్ అనిపించుకొని నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఇప్పటి వరకూ అల్లు అర్జున్ నటన ఒకెత్తు ఇప్పటి నుండి మరో ఎత్తు అన్నట్టుగా పుష్ప క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా చిత్తూరు యాస నేర్చుకొని చాలా కష్టపడ్డాడు బన్నీ. సినిమాలో ఎర్ర చందనం నరికే కూలగా చాలా నేచురల్ గా కనిపించి తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. సినిమా రిలీజ్ తర్వాత బన్నీ నటన గురించి మాట్లాడుకోని ప్రేక్షకుడు లేడు. అంతలా పుష్ప పాత్రతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.

Tollywood-Best-Actor-Balakrishna-Akhanda-zeecinemalu

అఖండ (బాలకృష్ణ)

నందమూరి బాలకృష్ణ నటన గురించి కొట్టగా చెప్పేదేముంది తనని సరిగ్గా వాడుకొని మాస్ సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర తన పెర్ఫార్మెన్స్ తో కాసుల వర్షం కురిపిస్తాడు. 'అఖండ'తో అఖండ విజయం అందుకొని ఈ ఏడాది బెస్ట్ యాక్టర్స్ లిస్టు లో చేరిపోయాడు బాలయ్య. సినిమాలో అఘోర పాత్రతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు. అటు మురళి కృష్ణ పాత్రతో మాస్ ఆడియన్స్ తో క్లాప్స్ , విజిల్స్ వేయించుకున్నాడు.

Vakeel-Saab

పవన్ కళ్యాణ్ (వకీల్ సాబ్)

ఫర్ ది ఫస్ట్ టైం వకీల్ సాబ్ గా కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రతో ఆకట్టుకొని నటుడిగా మరోసారి మంచి మార్కులు అందుకున్నాడు. ఓ సోషల్ డ్రామా సినిమాలో కమర్షియల్ హీరోగా కనిపించి మెప్పించాడు. తన కెరీర్ లో గర్వంగా చెప్పుకునే పాత్రల్లో ఒకటిగా సత్య దేవ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు.

రవితేజ (క్రాక్)

ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టడమే కాదు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు రవితేజ. చాలా గ్యాప్ తర్వాత పోలీస్ క్యారెక్టర్ దొరకడంతో మరిసారి  విక్రమార్కుడిలా రెచ్చిపోయి తన నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు.

వెంకటేష్ (నారప్ప)

విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఏడాది 'నారప్ప' తో ఉత్తమ నటుడు అనిపించుకున్నాడు. నిజానికి తమిళ్ ధనుష్ పెర్ఫార్మెన్స్ ని వెంకీ మ్యాచ్ చేయగలడా ? అనే డౌట్స్ ఉన్నప్పటికీ తన యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ తో ఆ క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. గెటప్ తో పాటు క్యారెక్టర్ కూడా కొత్త అయినప్పటికీ, నటుడిగా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడని మరోసారి నిరూపించుకున్నాడు.

Tollywood-Best-Actor-Allari-Naresh-zeecinemalu

అల్లరి నరేష్ (నాంది)

కెరీర్ ఆరంభంలో 'నేను' అనే డిఫరెంట్ ఫిలిం చేసి నటుడిగా మంచి మార్కులు అందుకున్న అల్లరి నరేష్ మళ్ళీ ఇన్నాళ్ళకి తనలో ఉన్న ఆ కోణాన్ని బయటపెట్టి 'నాంది' సినిమా చేశాడు. సూర్య ప్రకాష్ క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. న్యాయం కోసం చివరివరకూ పోరాడే పాత్రతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అ కష్టమంతా స్క్రీన్ పై కనిపించింది.

అఖిల్ అక్కినేని (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్) 

మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిలర్ సినిమాలో తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి ఆకట్టుకున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ హీరోలా కనిపిస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. ఇకపై తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునేలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు.

Tollywood-Best-Actor-VaishnavTej-Uppena-zeecinemalu

వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

మొదటి సినిమాతోనే బెస్ట్ యాక్టర్స్ లిస్టు లో చోటు దక్కించుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇచ్చిన  వైష్ణవ్ ఆశీ పాత్రలో ఒదిగిపోయి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో వైష్ణవ్ లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కొన్నేళ్ళ వరకూ ఆశీగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించాడు.

Tollywood-Best-Actor-Nani-Shyam-SinghaRoy-zeecinemalu

నాని (శ్యామ్ సింగ రాయ్ )

నాని అంటేనే నేచురల్ యాక్టింగ్ కి పెట్టింది పేరు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించే అతికొద్ది మంది యంగ్ హీరోల్లో నాని ఒకడు. అలాంటి నాని కి బెస్ట్ క్యారెక్టర్ పడితే పెర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ గానే ఉంటుంది. 'శ్యామ్ సింగ రాయ్' సరిగ్గా అదే ప్రూవ్ చేసింది. టైటిల్ రోల్ లో నాని అదరగొట్టేసాడు. సాయి పల్లవి యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం హీరోలకి కష్టమే. కానీ తన నేచురల్ యాక్టింగ్ తో సాయి పల్లవిని మ్యాచ్ చేసి బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు.

Tollywood-Best-Actor-Naveen-Polishetty-zeecinemalu

నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కామెడీ టైమింగ్ ఉన్న అతికొద్ది మందిలో నవీన్ పోలిశెట్టి ఒకడు. తన టైమింగ్ తో హిలేరియస్ గా నవ్వించగలిగే నవీన్ కి ఓ ఫుల్ ఫన్ ఫిలిం పడితే ఇంకేముంది థియేటర్స్ అంతా నవ్వులతో రీ సౌండ్ రావడం ఖాయం. 'జాతిరాత్నలు' సినిమాకి నవీన్ యాక్టింగ్ హైలైట్ గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో తన పేరు జోగిపేట్ శ్రీకాంత్ గా మార్చేసుకొని ఆడియన్స్ తో అలాగే పిలిపించుకుంటున్నాడు నవీన్.

Tollywood-Best-Actor-Naga-Chaithanya-zeecinemalu

నాగ చైతన్య (లవ్ స్టోరి)

నాగ చైతన్య కూడా ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ లిస్టులో ప్లేస్ సొంతం చేసుకున్నాడు. లవ్ స్టోరి చైతూని మరో కొత్త కోణంలో ప్రెజెంట్ చేసి నటుడిగా మంచి గుటింపు నిచ్చింది. మజిలీతో మంచి యాక్టర్ అనిపించుకున్న నాగ చైతన్య మరోసారి లవ్ స్టోరితో తన నటన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఈ సినిమా కోసం తెలంగాణా యాస్ నేర్చుకొని ఆ క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు.

Tollywood-Best-Actor-SreeVishnu-RajaRajaChora-zeecinemalu

శ్రీ విష్ణు (రాజ రాజ చోర)

ఈ ఏడాది 'రాజ రాజ చోర' సినిమాతో శ్రీ విష్ణు కూడా ఆకట్టుకున్నాడు. డబ్బు కోసం దొంగతనాలు చేస్తూ పోలీసులకి దొరకకుండా తప్పించుకునే భాస్కర్ పాత్రలో హిలేరియస్ గా నవ్వించాడు. సెకండాఫ్ లో భార్యని కన్విన్స్ చేసి తనతో మాట్లాడాలని చూసే సన్నివేశాల్లో శ్రీ విష్ణు నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది.

Tollywood-Best-Actor-Kiran-Abbavaram-zeecinemalu

కిరణ్ అబ్బవరం ( SR కళ్యాణ మండపం)

రెండో సినిమాతోనే బెస్ట్ యాక్టర్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. 'SR కళ్యాణ మండపం' సినిమాలో కిరణ్ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో చలాకీ  కుర్రాడిలా కనిపిస్తూ నవ్వించిన కిరణ్ ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మరింతగా ఆకట్టుకున్నాడు. ఆపోజిట్ సాయి కుమార్ లాంటి నటుడు ఉండటంతో తన నటనలో మెరుగులు దిద్దుకొని బాగా నటించాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics