18 Pages Movie Trailer Review
Sunday,December 18,2022 - 08:58 by Z_CLU
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" (18 Pages Movie) నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మాత. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రయిలర్ చూస్తే, అచ్చంగా సుకుమార్ స్టయిల్ లో ఉంది. కథ ఏంటనేది చెప్పకుండా చాలా కన్ఫ్యూజన్ చేశారు. అయితే, స్టోరీలైన్ చాలా కొత్తగా ఉండబోతోందనే విషయం మాత్రం ట్రయిలర్ తో అర్థమైంది.
నిఖిల్(Nikhil), అనుపమ (Anupama Parameswaran) పెర్ఫార్ఫెన్సులు ట్రయిలర్ లో ఆకట్టుకున్నాయి. ట్రయిలర్ చూస్తుంటే, వీళ్లిద్దరూ సినిమాలో కలుసుకోరనే ఫీలింగ్ కలుగుతుంది. అజయ్, బ్రహ్మాజీ లాంటి కీలక నటీనటుల్ని కూడా ట్రయిలర్ లో పరిచయం చేశారు.
ట్రయిలర్ రిచ్ గా ఉంది. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వసంత్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. కుమారి 21ఎఫ్ తర్వాత సుకుమార్-సూర్యప్రతాప్ కలిసి 18 పేజెస్ తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. 23న సినిమా రిలీజ్ అవుతోంది.