14 Years For MaheshBabu’s ‘Sainikudu’!

Monday,November 30,2020 - 01:01 by Z_CLU

మహేష్ పొలిటికల్ కథతో సినిమా చేస్తే....? అందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తే ? సరిగ్గా ఇదే ఆలోచనతో మహేష్ బాబుని డిఫరెంట్ రోల్ లో ప్రెజెంట్ చేసి గుణశేఖర్ 'సైనికుడు' సినిమా చేసాడు. పద్నాలుగేళ్ళ క్రితం ఇదే రోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాలో మహేష్ యువతరం నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

రాజకీయాలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన యువకుడిగా మహేష్ బాగా నటించాడు. హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సైనికుడు టైటిల్ సాంగ్ తో పాటు 'ఆడపిల్లా అగ్గిపుల్లా' పాట కూడా ఒక ఊపు ఊపేసింది. ఆ టైంలో ఎక్కడ విన్నా ఈ పాటలే ఎక్కువగా వినిపించేవి.

సినిమాలో మహేష్ , త్రిషల కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి. ఇటివలే స్వర్గస్థులైన నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన విభిన్నమైన విలనిజంతో మెప్పించాడు. మహేష్ తో మూడో సినిమాగా 'సైనికుడు' చేసిన గుణశేఖర్ తన టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ను బాగా అలరించాయి.

Watch Sainikudu Full Movie