#13YearsForRamCharanInTFI – 13 Years Chirutha

Monday,September 28,2020 - 06:18 by Z_CLU

సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇండస్ట్రీకి 'చిరుత' పులి వచ్చింది. ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూసిన మెగా అభిమానుల కోరిక తీరిన రోజు ఇది. మెగాస్టార్ వారసుడిగా Chirutha తో RamCharan హీరోగా ఎంట్రీ ఇచ్చిన డేట్ (28 సెప్టెంబర్ 2007) ఇది.

పూరి దర్శకత్వంలో మెగాస్టార్ తనయుడి సినిమా అని తేలినప్పటి నుండే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ కి ముందు మణిశర్మ అందించిన పాటలు మారుమ్రోగుతూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఎక్కడ చూసిన 'చిరుత' పాటలే వినిపించాయి. ఇక మెగా స్టార్ వారసుడి ప్రతిభను స్క్రీన్ పై చూడటానికి మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా థియేటర్స్ లో వాలిపోయారు. టైటిల్ కార్డ్స్ నుండే సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ హీరో క్యారెక్టర్ మీద సింపతీ తీసుకొచ్చేశాడు పూరి. మెగా పవర్ స్టార్ ఎంట్రీ సీను కోసం ఎదురుచూసిన అభిమానుల కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఫేస్ కనిపించకుండా షాట్స్ వేస్తూ ఓ రౌడీను కొడుతుండగా చరణ్ ఫేస్ రివీల్ చేస్తూ పూరి ఇచ్చిన ఇంట్రో సీనుకి సీటులో కూర్చున్న అభిమానులకు పూనకాలొచ్చాయి. ఆ ఎంట్రీ సీన్ ను తనదైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూ ఓ రేంజ్ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు మణిశర్మ.

మెగా పవర్ స్టార్ Ramcharan కి 'చిరుత' మంచి డెబ్యూ ఫిలింగా నిలిచింది. డాన్సులు, ఫైటులు మాత్రమే కాకుండా మొదటి సినిమాకే మంచి ఎమోషన్ పండించే అవకాశం ఉన్న రివేంజ్ కథ దొరకడంతో సిల్వర్ స్క్రీన్ పై దుమ్ముదులిపాడు చెర్రీ. తన రివేంజ్ కోసం ఎంతకైనా తెగించి, ఎంత దూరమైనా వెళ్ళే కుర్రాడి పాత్రలో చరణ్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. చిరు తనయుడిగా చెర్రీ డాన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

నిజానికి Chirutha లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే సినిమా అంతటి విజయం సాధించింది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ స్క్రీన్ పై బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాలో ఉన్న సెంటిమెంట్ ను మొదటి నుండే చెప్తూ వచ్చి దాన్ని సరైన టైంలో హైలైట్ చేసి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసాడు పూరి. ఇక చరణ్ -నేహా శర్మ కెమిస్ట్రీ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాలో క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా మణిశర్మ కంపోజ్ చేసిన పాటలను అంతే అందంగా చిత్రీకరించి మెస్మరైజ్ చేశాడు పూరి. పూరికి తన ఆలోచనను పర్ఫెక్ట్ రీచ్ చేసే టీం సపోర్ట్ బాగా కుదిరింది. అందరి సపోర్ట్ తీసుకొని పూరి తన మార్క్ తో చరణ్ కి మొదటి సినిమాకే సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చరణ్ వెనక్కి తిరిగి చూడకుండా స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.