10Million views for ‘Radheshyam’ First Single !

Wednesday,November 17,2021 - 07:11 by Z_CLU

ప్రభాస్ 'రాధేశ్యామ్' నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ తో దూసుకెళ్తుంది. "ఈ రాతలే" అంటూ విడుదలైన ఈ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ అందుకొని ఇంకా ట్రెండింగ్ లో ఉంది.  జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ సాంగ్ ని పాడటం మరో విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ చార్ట్

సాఫ్ట్ మెలోడీగా సాగే ఈ సాంగ్ లో యానిమేషన్ విజువల్స్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతున్నాయి. తాజాగా రిలీజైన ఫస్ట్ సింగిల్ కూడా మ్యూజిక్ లవర్స్ ఇంప్రెస్ చేసింది. ఈ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఆల్బంలోని రెండో సాంగ్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ , సచిన్ ఖేడెకర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics