1000 Dancers for RC15 Song Shoot

Thursday,July 07,2022 - 02:16 by Z_CLU

1000 Dancers for RC15 Song Shoot

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషనలో తెరకెక్కుతున్న RC15కి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇటివలే హైదరాబాద్ లో ఫిలిం సిటీలో ఓ భారీ షెడ్యుల్ కంప్లీట్ చేసిన యూనిట్ తాజాగా అమ్రిత్సర్ లో మూడు రోజుల పాటు ఓ సాంగ్ షూట్ చేసుకొచ్చారు. ఈ సాంగ్ కి సంబంధించి మిగతా షూట్ హైదరాబాద్ లో తీయనున్నారు. ఇక్కడ మరో మూడు , నాలుగు రోజుల పాటు సాంగ్ షూట్ జరగనుంది. ఈ సాంగ్ కోసం వేయి మంది డాన్సర్లను తీసుకున్నారు. భారీ స్కేల్ లో పాటను చిత్రీకరిస్తున్నారు.

హైదరాబాద్లో సాంగ్ షూట్ అవ్వగానే రాజమండ్రిలో మరో షెడ్యుల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఓ సెట్ వేసి చాలా పోర్షన్ తీసుకొచ్చారు. ఇంకా కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండటంతో మళ్ళీ వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు డెబ్బై శాతం షూట్ పూర్తయింది. డిసెంబర్ కల్లా టోటల్ షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.  చరణ్ లుక్స్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు శంకర్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics