‘Zombie Reddy’ Movie Review

Friday,February 05,2021 - 01:17 by Z_CLU

నటీ నటులు : తేజ సజ్జ, ఆనంది, ద‌క్ష, గెటప్ శ్రీను , హేమంత్ , కిరీటి తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌

సంగీతం : మార్క్ కె. రాబిన్‌

స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే

నిర్మాణం : యాపిల్ ట్రీ స్టూడియోస్‌

నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం : ప్ర‌శాంత్ వ‌ర్మ‌

విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021

రన్ టైం : 125 నిమిషాలు

'అ!' లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న ప్రశాంత్ వర్మ జాంబీ జోనర్ లో ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేశాడు.జాంబీలను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పెట్టి ప్రశాంత్ వర్మ తీసిన 'జాంబీ రెడ్డి' ఆడియన్స్ ను అలరించిందా? ఈ సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

కోవిడ్ 19కి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో ఉండే ఓ సైంటిస్ట్ మనుషులపై వ్యాక్సిన్ ట్రయిల్ వేస్తాడు. అందులో భాగంగా వ్యాక్సిన్ వికటించి ప్రయోగం చేసిన వ్యక్తి జాంబీగా మారతాడు. అదే క్రమంలో తన స్నేహితుడి పెళ్లికి ఫ్రెండ్స్ తో బయలుదేరిన మ్యారియో(తేజ సజ్జ) కర్నూల్ లోఅడుగుపెడతాడు.

పెళ్లి పీటలెక్కబోతున్న తన స్నేహుతుడు ఫ్యాక్షన్ గొడవల మధ్య ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న మ్యారియో చివరికి అతని స్నేహితుడితో పాటు జాంబీల నుండి రెండు ఊర్లను ఎలా కాపాడాడు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తేజ సజ్జ నటనలో చిన్నతనం నుండి తనకున్న అనుభవంతో మ్యారియో క్యారెక్టర్ ను ఈజ్ తో చేశాడు.మొదటి సినిమాతోనే హీరోగా ఆకట్టుకొని మంచి మార్కులు కొట్టేశాడు. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన తెలుగు కథానాయిక ఆనంది తనపాత్రలో ఒదిగిపోయింది. ఎప్పుడూ గేం ఆడుతూ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని మ్యాగీ పాత్రలో దక్ష అలరించింది. గెటప్ శ్రీను తనకామెడీ టైమింగ్ , ఎక్స్ ప్రెషన్స్ తో అలరించి నవ్వించాడు. హేమంత్ తన పాత్రతో ఎంటర్టైన్ చేశాడు.

ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో వినయ్ వర్మ , నాగ మహేష్ మంచి నటన కనబరిచారు. పృథ్వీ , రోలర్ రఘు కామెడీ పండలేదు.  పెళ్లి ఆగిపోయి పిచ్చిదానిలా మారిన పాత్రలో హరితేజ, ఇంటి పెద్దదిక్కు పాత్రలో అన్నపూర్ణమ్మ , తల్లిదండ్రుల పాత్రల్లో హర్ష వర్ధన్ , ప్రియ, మహేష్ విట్ట అలాగే మిగతా నటీ నటులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

జాంబీ జోనర్ లో సినిమా అంటే టెక్నికల్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. జాంబీ రెడ్డి సినిమాకు టెక్నీషియన్స్ అందరు బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగాఆర్టిస్టులకు తన మేకప్ తో జాంబీలుగా మార్చడంలో మేకప్ ఆర్టిస్ట్ పనితనం కనిపించింది. అనిత్‌ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్. మార్క్ కె. రాబిన్‌ ట్యూన్ చేసిన 'గో కరోన' సాంగ్ బాగుంది. ముఖ్యంగా తన నేపథ్య సంగీతంతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు మార్క్. ఎడిటింగ్ బాగుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను పర్ఫెక్ట్ టైమింగ్ తో చూపించడం చాలా ముఖ్యం. ఎడిటర్ సాయి బాబు వర్క్ మెచ్చుకోవచ్చు.శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌ ఆర్ట్ వర్క్ ప్రతీ ఫ్రేంలో కనిపించింది. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కథనం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

టాలీవుడ్ లో ఉప్పుడున్న యంగ్ ఎక్స్ పెరిమెంట్ స్టోరీ టెల్లర్స్ లో ప్రశాంత్ వర్మ ఒకడు. మొదటి సినిమా 'అ!' తోనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ప్రశాంత్ ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో కూడిన కథలతో సినిమా చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈసారి జాంబీలతో ఓ డిఫరెంట్ జోనర్ టచ్ చేశాడు. కాకపోతే ప్రయోగం చేసే క్రమంలో డైరెక్టర్ గా కన్ఫ్యూజ్ అయ్యాడు.

ప్రారంభంలో వచ్చే సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు ఆ తర్వాత కామెడీ  కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు.  సెకండ్ హాఫ్ లో గెటప్ శ్రీను తాలూకు కామెడీ సన్నివేశాలు ఎంటర్టైన్ చేశాయి.కామెడీ సన్నివేశాలతో కొంత వరకు ఎంటర్టైన్ చేసిన ప్రశాంత్ వర్మ క్యారెక్టర్స్ , స్క్రీన్ ప్లే పై ఇంకాస్త ఫోకస్ పెట్టి స్క్రిప్ట్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా కథలో ఉన్న మైథాలజీ ఎలిమెంట్ ని సరిగ్గా చూపించలేకపోయాడు. క్లైమాక్స్ కూడా చుట్టేసినట్టుగా ఉందే తప్ప థ్రిల్ చేయలేదు. తేజ సజ్జకి మొదటి సినిమా కావడంతో అతని బిల్దప్ షాట్స్ పై దృష్టి పెడుతూ కమర్షియల్ హీరోగా చూపించే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. ఆ షాట్స్ చూసి కుర్ర హీరోకి ఇంత బిల్డప్ అవసరమా ? అనిపించడం ఖాయం.

కొన్ని హాలీవుడ్ సినిమాలను ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా తీసిన ప్రశాంత్ వర్మ కథను ఇంకాస్త ఆసక్తి కరంగా నడిపించి థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ తో కథనం రాసుకునుంటే బాగుండేది. స్క్రిప్టింగ్ స్టేజిలో ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఎలిమెంట్స్ స్క్రీన్ పై పెద్దగా పండలేదు. చాలా వరకు హారర్ సినిమాలో ఉండే కామెడీ క్యారెక్టర్స్ తోనే సినిమా తెరకెక్కించాడు ప్రశాంత్. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే జంబీ సన్నివేశాలు కొన్నేళ్ళ క్రితం వచ్చిన రామ్ గోపాల్ వర్మ 'దెయ్యం' సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. ఇక తన ప్రతీ సినిమాకు టెక్నీషియన్స్ నుండి బెస్ట్ వర్క్ తీసుకునే ప్రశాంత్ ఈసారి కూడా మార్క్ రాబిన్ , అనిత్ ల నుండి మంచి వర్క్ రాబట్టాడు. ఓవరాల్ గా 'జాంబీ రెడ్డి' కొన్ని నవ్వులతో జస్ట్ ఫరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2 .5/ 5