Zee5’s ‘Puli Meka’ Series Review

Saturday,February 25,2023 - 11:35 by Z_CLU

నటీ నటులు : లావణ్య త్రిపాఠి , ఆది సాయి కుమార్ , సుమన్ ,గోపరాజు , రాజా , సిరి హనుమంతు , స్పందన , ముక్కు అవినాష్ తదితరులు

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

కెమెరా : రామ్ కె.మ‌హేష్‌

కథ : కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు

దర్శకత్వం : చక్రవర్తి

ఫ్లాట్ ఫామ్ : Zee5

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2023

ఎపిసోడ్స్ : 8

లావణ్య త్రిపాఠి , ఆది సాయి కుమార్ కాంబినేషన్ లో కోనా వెంకట్ క్రియేట్ చేసిన పులి మేక జీ 5 ద్వారా ప్రేక్షకుల మునుకొచ్చింది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కి చక్రవర్తి దర్శకుడు. ప్రీ రిలీజ్ కంటెంట్ తో ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసిన ఈ సిరీస్ మెప్పించిందా ? పులి మేక అడుగడుగునా ఆసక్తి రేకెత్తించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

ఎలాంటి కేసునైనా 48 గంటల్లో క్లోజ్ చేయగలిగే సత్తా ఉన్న ట్రైనీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) కి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇద్దరి మర్డర్ కేసుని అప్పజెపుతాడు కమీషనర్ (సుమన్). ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసే ప్రభాకర్ (ఆది సాయి కుమార్) ఈ కేసులో క్లూ ఇచ్చి మర్డర్స్ చేస్తుంది సైకో అని చెప్తాడు.

దీంతో ప్రభాకర్ సపోర్ట్ తీసుకుంటూ తనకిచ్చిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ముందుకెళ్తుంది కిరణ్ ప్రభ. ఈ హత్య కేసు పట్టుకొని వెళ్ళే కొద్ది కొన్ని ట్విస్టులు రివీల్ అవుతుంటాయి. కేసులో భాగంగా కిరణ్ తో ట్రావెల్ అయ్యే ప్రభాకర్ ఆమెతో ప్రేమలో పడతాడు. కేసు క్లోజ్ అయ్యే సరికి ఇద్దరు ఒకటవుతారు. ఇంతకీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కీలక వ్యక్తులను హత్య చేసింది ఎవరు ? ఆ కేసును కిరణ్ ప్రభ ఎలా ఛేదించింది ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

కిరణ్ ప్రభ కేరెక్టర్ కి లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్ అనిపించుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకోని సిరీస్ కి హైలైట్ అనిపించుకుంది. ఫస్ట్ టైమ్ సిరీస్ లో కనిపించిన హీరో ఆది సాయి కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గతంలో చేసిన పాత్రే కావడంతో సుమన్ తన నటనతో మెప్పించాడు. జ్యోతిష్యుడి పాత్రలో గోపరాజు రమణ అలరించాడు. రాజా తన పాత్రకు పర్ఫెక్ట్. సిరి హనుమంతు కి కథలో కీలకమైన పాత్ర దక్కడంతో నటనతో మెప్పించి మంచి మార్కులు అందుకుంది. ముక్కు అవినాష్ అలరించాడు. స్పందన తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆ మూడ్ లోకి తీసుకెళ్ళే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిరీస్ కి హైలైట్ గా నిలిచింది. రామ్ కె.మ‌హేష్‌ విజువల్స్ సిరీస్ కి అందం తీసుకొచ్చాయి. ఆర్ట్ వర్క్ బాగుంది.

కొనా వెంకట్ , వెంక‌టేష్ కిలారు రైటింగ్ సిరీస్ కి బిగ్ ప్లస్ పాయింట్ అనిచెప్పవచ్చు. ఎంచుకున్న కథ , దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. దర్శకుడు చక్రవర్తి అన్ని ఎపిసోడ్స్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వెల్యూస్ సిరీస్ క్వాలిటీ తెలిపేలా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

The Hunt Begins :

6 నెలల క్రితం కరీంనగర్ లో 12 బిచ్చగాళ్లను చంపిన సైకో కిల్లర్ ను కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) పట్టుకోవడం తో సిరీస్ మొదటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఎపిసోడ్ లో లావణ్య త్రిపాఠి , ఆది సాయి కుమార్ కేరెక్టర్స్ ను హైలైట్ చేస్తూ ముందుకు నడిపించాడు దర్శకుడు. లావణ్య త్రిపాఠి కేరెక్టర్ తో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ చూపించి కిరణ్ ప్రభ ఎంత పవర్ ఫుల్ విమెన్ అన్నది ఎస్టాబిలిష్ చేశారు. 48 గంటల్లో సైకో కిల్లర్ కేసును సాల్వ్ చేసి సైకోను పట్టుకున్న ట్రైనీ ఆఫీసర్ కిరణ్ ప్రభ అంటూ కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ కేరెక్టర్ ని హైలైట్ చేశారు. అలాగే ప్రభాకర్ (ఆది సాయి కుమార్) ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ వర్క్ చేస్తాడని చూపించారు. అతనికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రకాష్ రెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ ను రైల్వే స్టేషన్ లో సైకో మర్డర్ చేయడం ఆ కేసును కిరణ్ చేతిలో పెట్టడంతో ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్ పై ఆసక్తి పెంచింది.

Case Closed :

కిరణ్ ప్రభ చేతిలో కమీషనర్ ప్రకాష్ రెడ్డి కేసు పెట్టడమే ఆలస్యం, ఈ మర్డర్ వెనుక రవి యాదవ్ హస్తం ఉందని గుర్తించి కిరణ్ ఆ కేసును క్లోజ్ చేస్తుంది. రవి యాదవ్ ను పట్టుకునే సన్నివేశాలు , కరుణాకర్ శర్మ ఇండియాకి రావడం సిరీస్ పై ఆసక్తి పెంచేలా చేసింది. ఈ ఎపిసోడ్ లో ఆఫీస్ లో పరిచయమై కిరణ్ ప్రభ - ప్రభాకర్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ప్రభాకర్ ను తన టీంలోకి తెచ్చుకొని క్లూస్ తెలుసుకునే సీన్ బాగుంది. రవి యాదవ్ ను కిరణ్ టీం పట్టుకోవడం , ఆ తర్వాత బంజారా హిల్స్ acp శ్రీనివాస్ తన కుటుంబంతో ఫామ్ హౌజ్ కి వెళ్ళడం అతన్ని చంపేందుకు సైకో అక్కడ ఎంట్రీ ఇవ్వడం షాట్ తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

Killer in Disguise

అమెరికాలో ఉన్నానంటూ చెప్తున్న కొడుకు కరుణాకర్ శర్మ ను అతని తల్లి చూసే సన్నివేశంతో ఎపిసోడ్ మొదలవుతుంది. అసలు కుటుంబానికి కరుణాకర్ ఎందుకు అబద్దం చెప్పాడు ? అనేది సస్పెన్స్ గా ఉంచారు. కిరణ్ ప్రభకి చిన్న కొడుకు ప్రభాకర్ కి సంబంధం మాట్లాడటానికి దివాకర శర్మ సతీమణితో వెళ్ళే సీన్ బాగుంది. రవి యాదవ్ ను ఇంట్రాగేట్ చేసే సీన్ , తర్వాత బంజారాహిల్స్ ACP శ్రీనివాస్ ను సైకో హత్య చేయడం , ఆ మర్డర్ తర్వాత రవి యాదవ్ కి ఈ హత్యలతో సంబందం లేదని కమీషనర్ చెప్పడంతో కిరణ్ ప్రభ అసలు హంతకుడిని పట్టుకునేందుకు కేసును స్పీడప్ చేస్తుంది. ఇక తన అన్నయ్య ఇండియాలోనే ఉంటున్నాడని తెలిసి అతని ఆఫీస్ కెళ్ళి ప్రభాకర్ మాట్లాడే సీన్ బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ సన్నివేశంతో ఎమోషనల్ గా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

The twist

కిరణ్ ప్రభ పై సైకో ఎటాక్ చేయడంతో మొదలైన ఎపిసోడ్ లో లవ్ సీన్స్ , మదర్ సెంటిమెంట్ మిక్స్ చేశారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్ దస్తగిరి మర్డర్ తో సిరీస్ పై ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ రివీల్ చేసి అసలేం జరిగింది ? కిరణ్ ప్రభ ఎవరు అనే ఆసక్తి పెంచేలా సిరీస్ ను నడిపించారు. ట్విస్ట్ పేరుతో వచ్చే ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ బాగా పేలింది. కథను మలుపు తిప్పే ఈ ట్విస్ట్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్ లో 34 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి వచ్చే సీన్ నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే చూసేలా చేస్తుంది.

 

Kiran's Past

కిరణ్ ప్రభ గతం చెప్తూ వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఎపిసోడ్ నడుస్తుంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లోడ్రగ్ కేసుతో వచ్చే ఫ్లాష్ బ్యాక్ తో కథ సరికొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్ లో పల్లవి అనే కేరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసి కథను ఇంకోలా టర్న్ చేశారు. ఎపిసోడ్ లో భరణి , సమ్మెట గాంధీ కేరెక్టర్స్ ఆకట్టుకున్నాయి.

 

A Parallel Investigation

తండ్రి పని నచ్చక దూరమైన కొడుకుకి బుద్ది వచ్చేలా చేసే సన్నివేశంతో ఎపిసోడ్ మొదలయింది. ఆ సీన్ ఆకట్టుకుంది. అలాగే కిరణ్ ప్రభ -ప్రభాకర్ మధ్య లవ్ సీన్స్ తో ఎంగేజ్ మెంట్ వరకు వచ్చే సాంగ్ బాగుంది. సైకో మర్డర్ కేసులో కమిషనర్ కి ఓ న్యూస్ తెలుస్తుంది, దీంతో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇమ్మాన్యుయెల్ ను రంగంలోకి దింపి ప్యారలెల్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. పల్లవి జీవితంలో ఉండే వ్యక్తులను తెలుసుకునేందుకు ఇమ్మాన్యుయెల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు.

Justice

పల్లవికి అన్యాయం చేసిన వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆమెకి న్యాయం చేయాలని కిరణ్ ప్రభ , ప్రభాకర్ ఇద్దరు కలిసి సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ క్రమంలో సృజన , యాదమ్మ ను కిడ్నాప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరో వైపు ఇమ్మాన్యుయెల్ కూడా పల్లవి కుటుంబం పై ఫోకస్ పెట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఎపిసోడ్ అంతా ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో ఆసక్తిగా సాగింది. ఇన్వెస్టిగేషన్ డ్రామాతో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

The Next Target

పల్లవి కేస్ లో ఏం జరిగిందో తెలియజెప్పే ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో మొదలైన ఎపిసోడ్ లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి చెప్పే సీన్స్ ఆకట్టుకున్నాయి. మరో పాత్రతో ఇంకో ట్విస్ట్ పేల్చారు. ఫైనల్ గా పల్లవి కేసులో ఆమెకి న్యాయం జరిగేలా చేసి నెరస్థుడిని పట్టించే సీన్ తో ఎండ్ చేస్తూ కిరణ్ ప్రభ -ప్రభాకర్ ఇద్దరు కలిసి హనీ మూన్ ట్రావెల్ తో టోటల్ సిరీస్ ఫినిష్ చేశారు. అయితే నెక్స్ట్ టార్గెట్ అంటూ మరో లీడ్ ఇచ్చి పులి మేక నుండి మరో సీజన్ రాబోతున్నట్టు లీక్ ఇచ్చి క్యూరియాసిటీ రైజ్ చేశారు.

ఓవరాల్ గా మిస్టరీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులి మేక ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తి పెంచేస్తూ ఆకట్టుకుంది. కథ , కథనం ఆకట్టుకున్నాయి. కేరెక్టర్స్ , వాటి డిజైనింగ్ అలాగే నటీ నటుల నటన సిరీస్ కి ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా పులి మేక ఇంట్రెస్టింగ్ గా సాగుతూ మెప్పించింది.

 

రేటింగ్ : 3 /5

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics