‘Vitamin She’ Movie review

Wednesday,December 30,2020 - 06:45 by Z_CLU

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రచి తాకెర్, రంజిత్ రెడ్డి, వికాస్ పొన్నూరు, సంజీవ్ జోషి, మోయిన్, అశోక్

సంగీతం : పివిఆర్. రాజా

కెమెరా. : శివ శంకర వర ప్రసాద్

నిర్మాత: రవి పొలిశెట్టి

కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం: జయశంకర్

లాక్ డౌన్ లో కొందరు దర్శకులు కొత్త కాన్సెప్ట్స్ తో OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ కూడా టెక్నాలజీ మీద ఓ డిఫెరెంట్ కథను రాసుకొని 'విటమిన్ షి' అనే సినిమాను రూపొందించి ఆడియన్స్ కి అందించాడు. మరి జయశంకర్ తను అనుకున్న కాన్సెప్ట్ అనుకున్నట్టు తీసి నెటిజన్లను మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

స్నేహితుడి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎంప్లాయ్ గా పనిచేసే లింగబాబు యోగానంద అలియాస్ లియో(శ్రీకాంత్ గుర్రం) తనతో పాటు పనిచేసే వైదేహిని తొలిచూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. టెక్నాలజీ లేకుండా మొబైల్ వాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని లియో తన పాత మొబైల్ పాడవ్వడంతో 'విటమిన్ షి' అనే కొత్త మొబైల్ కొంటాడు.

ఆ మొబైల్ లో వాయిస్ అసిస్టెంట్ లైలా.. లియో కి ఫ్రెండ్ గా మారి వైదేహిని లియో ప్రేమలో పడేసేలా చేస్తుంది. లియోని వైదేహి ప్రేమించేలా చేసిన లైలా.. తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. అది తెలుసుకున్న లియో చివరికి పెళ్లి చేసుకొని భర్తతో డైవర్స్ తీసుకున్న వైదేహిను మళ్ళీ ఎలా కలిశాడు? చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా? అసలు లైలా ఎందుకలా చేసింది అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

నటనలో అనుభవం ఉన్న హీరోయిన్ ప్రచి తాకేర్ తో పాటు హీరో శ్రీకాంత్ గుర్రం కూడా మంచి మార్కులు అందుకున్నాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మొయిన్, వికాస్ తో పాటు సంజీవ్ జోషి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఈ వెబ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ వారి వర్క్ లో బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ తో పాటు మ్యూజిక్ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. శివ శంకర్ వర ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది. కథకు తగ్గట్టుగా బెస్ట్ విజువల్స్ అందించాడు. పివిఆర్. రాజా అందించిన రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. సినిమాను పర్ఫెక్ట్ టైమింగ్ తో కట్ చేసిన నాని ఎడిటింగ్ వర్క్ బాగుంది.

వాయిస్ అసిస్టెంట్ లైలా కి రాజశ్రీ నాయిర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ బాగా సూటైంది. అలాగే టైటిల్ కార్డ్స్ లో దర్శకుడు చెప్పాలనుకున్న సందేశంతో రవి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా బాగుంది. దర్శకుడు జయశంకర్ రాసుకున్న కథ -స్క్రీన్ ప్లే - డైలాగ్స్ సినిమాకు బలాన్నిచ్చాయి. లైలా - లియో మధ్య వచ్చే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

vitamin-she-movie-review-telugu విటమిన్-షి మూవీ రివ్యూ జీ సినిమాలు సమీక్ష :

OTT లో సినిమా చూడాలంటే ఏదో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉండాల్సిందే. అప్పుడే నెటిజన్లు ఆ సినిమాపై ఓ లుక్కేస్తారు. సరిగ్గా అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే దర్శకుడు జయశంకర్ లాక్ డౌన్ లో కరోనాకి సంబంధించిన ఓ పాయింట్ తో ఈ కథను రాసుకొని తక్కువ నిడివితో వెబ్ మూవీగా తెరకెక్కించాడు. తను చెప్పాలనుకున్న కథను క్రిస్పీగా చెప్తూ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్.

టెక్నాలజీకి మరింతగా దగ్గరవుతూ తోటి మనిషికి దూరమవుతున్న మనిషికి స్ట్రాంగ్ గా ఓ కాన్సెప్ట్ ద్వారా వార్నింగ్ తో కూడిన సందేశాన్ని అందించిన తీరు బాగుంది. లాక్ డౌన్ లో టెక్ మార్క్ అనే రైటర్ రాసిన 'లైఫ్ 3.O' అనే పుస్తకం నుండి మెయిన్ పాయింట్ ను ఆదర్శంగా తీసుకొని ఈ కథను రెడీ చేసుకున్న దర్శకుడు జయశంకర్.. సినిమా ద్వారా చాలా విషయాలు ప్రస్తావించి కనువిప్పు కలిగించాడు. టెక్నాలజీ మనిషిలో బద్ధకం పెరిగేలా చేస్తుందని అలాగే టెక్నాలజీ మనిషిని శాసించే స్థాయికి చేరుకుంటుందని టైటిల్ కార్డ్స్ లో వాయిస్ ఓవర్ ద్వారా ఓ వార్నింగ్ ఇస్తూ తెలియజేశాడు.

అయితే దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ మధ్యలో లవ్ ట్రాక్ కాస్త బోర్ కొట్టించింది. సినిమాలో లవ్ ట్రాక్ గతంలో వచ్చిన సాఫ్ట్ వేర్ లవ్ స్టోరీస్ ను గుర్తుచేసేలా ఉంది. కాకపోతే లైలా అనే వాయిస్ అసిస్టెంట్ ఎలిమెంట్ కొత్తగా అనిపిస్తుంది. 'పేపర్ బాయ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జయశంకర్ ఈ OTT సినిమాను బాగానే డీల్ చేసాడు. ముఖ్యంగా తక్కువ మంది నటీ నటులతో తెరకెక్కించి వారి నుంచి మంచి నటన రాబట్టాడు.  దర్శకుడిగా అతనికి మరికొన్ని ఆఫర్స్ తెచ్చే సినిమా ఇది. కాకపోతే ఇది కేవలం ఓటిటి కోసం తీసిన సినిమా కావడంతో క్వాలిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు సినిమా మేకింగ్ లో ఇంకాస్త క్వాలిటీ మైంటైన్ చేసి ఉంటే బెటర్ గా ఆ ఉండేది. ఓ గంట సేపు తీరిక చేసుకొని సినిమా చూస్తే కరోన వెనుక నిజంగానే ఓ కుట్ర ఉందేమోనన్న సందేహం కలుగుతుంది. ఓవరాల్ గా 'VITAMIN SHE' చక్కని సందేశంతో కూడిన మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

బాటమ్ లైన్ - కొత్త కాన్సెప్ట్.. సరికొత్త ప్రయత్నం

రేటింగ్   2.5/5