Vijay Deverakonda’s ‘Liger’ Movie Review

Thursday,August 25,2022 - 12:17 by Z_CLU

నటీ నటులు : విజయ్ దేవరకొండ , అనన్య పాండే , రమ్య కృష్ణ , రోనిత్ రాయ్ , విషు రెడ్డి , ఆలి , గెటప్ శ్రీను తదితరులు

ఎడిటింగ్ : జనైద్ సిద్దిక్

కెమెరా : విష్ణు శర్మ

ఆర్ట్ వర్క్ : జానీ షేక్ భాషా

మ్యూజిక్ సూపర్వైజర్ : అజీమ్ దయాని

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సునీల్ కాశ్యప్

నిర్మాతలు : పూరి , ఛార్మీ, కరణ్ జోహార్ , అపూర్వ మెహత

రచన -దర్శకత్వం : పూరి జగన్నాథ్

నిడివి : 140 నిమిషాలు

విడుదల తేది : 25 ఆగస్ట్ 2022

 

విజయ్ దేవరకొండ -పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' సినిమా గురించి మూవీ లవర్స్ ఆసక్తి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ఈరోజే అంచనాలు నడుమ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్. మరి 'లైగర్' తో రౌడీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడా ? 'ఇస్మార్ట్ శంకర్' తో ఐయాం బ్యాక్ అనిపించుకున్న పూరి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ :

కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ) ని మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ చేయించి ఛాంపియన్ చేయాలనే గోల్ పెట్టుకొని కరీంనగర్ నుండి ముంబైలో సెటిలవుతుంది బాలమణి(రమ్య కృష్ణ). తన భర్త తో గేమ్ ఆడి పోయిన కోచ్(రోనిత్ రాయ్) దగ్గర లైగర్ ని జాయిన్ చేస్తుంది. నత్తితో మాట్లాడటానికి ఇబ్బంది పడే లైగర్ ఫైటర్ గా పర్ఫెక్ట్ అనిపించుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటాడు.

ఈ క్రమంలో లైగర్ ఫైటింగ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది తానియా(అనన్య పాండే). తన తల్లి మాట కాదని తానియాతో ప్రేమలో పడతాడు లైగర్. ఒక టైంలో తానియా లైగర్ కి నత్తి ఉందనే కారణంగా అతన్ని దూరం పెట్టి బ్రేకప్ చెప్పేస్తుంది. ప్రేమలో ఓడిపోయిన లైగర్ ఫైటర్ గా సక్సెస్ అయ్యాడా ? అమెరికాలో ఫైనల్స్ ఆడి మార్షల్ ఆర్ట్స్ లో సూపర్ ఛాంపియన్ అనిపించుకున్నాడా ? లేదా అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

విజయ్ దేవరకొండ యాక్టింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చెప్పుకోనక్కరలేదు. కేరెక్టర్ లో దమ్ముంటే యాక్టర్ గా బెస్ట్ ఇస్తాడు విజయ్. లైగర్ కేరెక్టర్ లో హీరోగా మెప్పించాడు. నత్తి తో మాట్లాడే సన్నివేశాల్లో విజయ్ నటన ఆకట్టుకుంది. అనన్య పాండే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ లానే గ్లామర్ షో కి మాత్రమే పరిమితమైంది. ఆమె కేరెక్టర్ ద్వారా వచ్చే ట్విస్ట్ వావ్ అనిపించలేకపోవడంతో జస్ట్ ఫరవాలేదనిపించుకుంది. క్లైమాక్స్ లో వచ్చే టైసన్ గెస్ట్ అపిరియన్స్ సరిగ్గా కుదరకపోవడంతో ఆడియన్స్ కోరుకున్నట్టుగా ఆ కేరెక్టర్ క్లిక్ అవ్వలేదు. ధనవంతుడి పాత్రలో చుంకీ పాండే ఆకట్టుకున్నాడు.

తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటన బాగుంది. మాస్ రోల్ లో కనిపిస్తూ కొత్తగా ఎంటర్టైన్ చేసింది. కోచ్ గా రోనిత్ రాయ్ ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆ పాత్రకు న్యాయం చేశాడు. ఆలి కామెడీ పండలేదు. గెటప్ శీను కామెడీ రెండు మూడు సార్లు వర్కౌట్ అయింది కానీ మరీ హిలేరియస్ గా అనిపించలేదు. హీరోయిన్ అన్నయ్య పాత్రలో ఫైటర్ రోల్ లో నటించిన విషు బాగానే నటించాడు. విలన్ గా ఫిట్ అనిపించుకున్నాడు. టెంపర్ వంశీ మిగతా నటీ నటులంతా వారి పాత్ర మేరకూ నటించి అలరించారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

 "అకిడి పకిడి" , "కొనిస్తనే కోకా" , "జవానీ తేరి" పాటలు విజువల్ గా ఆకట్టుకున్నాయి కానీ ఆడియో పరంగా జస్ట్ పరవాలేదనిపించుకున్నాయి. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం అక్కడక్కడా బాగుంది.  యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి స్కోర్ ఇచ్చాడు. విష్ణు శర్మ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సీన్స్ , సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని పనితనం కనిపించింది. జనైద్ సిద్దిక్ ఎడిటింగ్ పరవాలేదు. జానీ షేక్ భాషా ఆర్ట్ వర్క్ బాగుంది. కెచా అలాగే మిగతా ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

పూరి డైలాగ్స్ ఈసారి అంతగా ఆకట్టుకోలేదు. స్టోరీ -స్క్రీన్ ప్లే కూడా కాస్త రొటీన్ గానే ఉండటంతో సినిమాలో కొత్తదనం కనిపించలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

పూరి జగన్నాథ్ అంటే ఫైర్ బ్రాండ్ , విజయ్ దేవరకొండ కూడా అదే కోవకి వస్తాడు. మరి ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఓ యాక్షన్ సినిమా చేస్తే ? .. ఇదే 'లైగర్' పై హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకోసం పూరి మార్షల్ ఆర్ట్స్ ఎంచుకోవడం విజయ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ పెట్టడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. కానీ ఆ అంచనాలను అందుకునే స్టఫ్ సినిమాలో క్రియేట్ చేసి మెస్మరైజ్ చేయలేకపోయాడు పూరి జగన్నాథ్.  ఈ సినిమాను రొటీన్  ఫార్మేట్ లోనే తెరకెక్కించి నిరాశ పరిచాడు పూరి. నిజానికి విజయ్ -పూరి కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా పూరి ఓ సాదా సీదా కంటెంట్ తో రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించడం సినిమాకు ప్రధాన బలహీనత. అలా అని కథలో దమ్ము లేదా అంటే కచ్చితంగా ఉంది.  ట్రీట్ మెంట్ మార్చి కొత్తగా ప్రెజెంట్ చేసి యాక్షన్ మసాలా తో హై ఇచ్చే ఎలిమెంట్స్ తో కంటెంట్ నింపేసి పూరి ఒకప్పటి టేకింగ్ చూపిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది.

లైగర్ కోసం విజయ్ బాగా కష్టపడ్డాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడం కోసం చాలా కసరత్తు చేశాడు అతని కష్టం స్క్రీన్ పై కనిపించింది. నత్తి ఉన్న కుర్రాడిగా బాగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫైటర్ గా మెప్పించాడు. అకిడి పకిడి సాంగ్ లో ఫ్లోర్ స్టెప్స్ వేసి డాన్సింగ్ తో మెస్మరైజ్ చేశాడు.  కానీ హీరో ఎంత కష్టపడినా సరైన కథ -కథనం కుదరకపోతే ఆ కష్టమంతా వృధా అవుతుంది.  పూరి ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత వెంటనే లైగర్ ని స్టార్ట్ చేయకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. అలాగే మేకింగ్ కి కూడా ఎన్నడూ లేని విధంగా ఎక్కువ టైం తీసుకున్నాడు. అంత టైం తీసుకున్న పూరి స్క్రిప్ట్ వర్క్ మీద దృష్టి పెట్టి ఇంకా బాగా వర్క్ చేసుకొని తన మార్క్ సన్నివేశాలతో అదిరిపోయే ట్విస్టులు రాసుకుని, కంప్లీట్ యాక్షన్ సినిమాగా తీర్చి దిద్ది ఉంటే మూవీ లవర్స్ కి ఓ బ్లాక్ బస్టర్ దక్కేది.

హీరోయిన్ కేరెక్టర్ తో  సిల్లీగా అనిపించే ఓ ట్విస్ట్ రాసుకొని పూరి  'లైగర్' సినిమా తీయడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. 'పోకిరి' లో కృష్ణ మనోహర్ ట్విస్ట్ తో థియేటర్స్ లో అరుపులు పుట్టించి, ఇన్నేళ్ళయినా ది బెస్ట్ ట్విస్ట్ అంటూ దాని గురించి చెప్పుకునేలా తీసిన కిక్ ఇచ్చిన పూరి 'లైగర్' లో అనన్య పాండే కేరెక్టర్ ద్వారా ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే ఎవరికైనా సిల్లీగానే అనిపిస్తుంది. ఇక హీరో ఫైట్ చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయి లవ్ లో పడటం , అనన్య కేరెక్టరైజేషన్ రెగ్యులర్ పక్కా కమర్షియల్ సినిమాల్లోలానే కనిపించడంతో లవ్ ట్రాక్ పండలేదు.  రమ్య కృష్ణ , విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి కానీ వారి మధ్య సెంటిమెంట్ పండే సన్నివేశాలు పడలేదు. ఇక హీరో కేరెక్టరైజేషణ్ ని పర్ఫెక్ట్ గా రాసుకొని ప్రతీ కామన్ మెన్ కి కనెక్ట్ చేయడంలో పూరి దిట్ట. లైగర్ పాత్రను కూడా ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ చేయగలిగాడు కానీ ఆ పాత్రతో ఇంపాక్ట్  క్రియేట్ చేయలేకపోయాడు. సాంగ్స్ , కొన్ని సీన్స్ చూస్తే బాలీవుడ్ ఫార్మేట్ లో హిందీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా ఉన్నాయి. దాంతో కొన్ని సార్లు  హిందీ డబ్బింగ్ సినిమా చూసినట్టుగా అనిపించింది. టైసన్ తో విజయ్ కి ఓ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని ఊహించిన ఆడియన్స్ ని కూడా పూరి నిరాశ పరిచాడు. టైసన్ తో కామెడీ చేయించడంతో  ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే స్పోర్ట్స్ డ్రామా లో ఉండే క్లైమాక్స్ కాకుండా పూరి ఈసారి డిఫరెంట్ గా  ప్లాన్ చేసుకున్నాడు కానీ ఆ క్లైమాక్స్ వర్కౌట్ అవ్వలేదు.

ఇక  మర్షన్ ఆర్ట్స్ తో యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం ఆడియన్స్ ని మెప్పింఛి సినిమాలో హైలైట్ గా నిలిచాయి. అలాగే విజయ్ దేవేరకొండ నటన , అనన్య పాండే గ్లామర్ , సాంగ్స్ పిక్చరైజేషన్ , రమ్య కృష్ణ -విజయ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనిపించాయి.  విజయ్ దేవరకొండ కోసం, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 'లైగర్' ని ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5