Spark Movie Review

Saturday,November 18,2023 - 02:46 by Z_CLU

నటీ నటులు : విక్రాంత్, మెహ్రీన్, రుక్సార్, సుహాసిని మణిరత్నం, గురు సోమ సుందరం,నాజర్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు సంగీతం : హేషమ్ అబ్దుల్ వహబ్ కథ - స్క్రీన్ ప్లే - నిర్మాణం : విక్రాంత్ విడుదల తేదీ : 17 నవంబర్ 2023 స్పార్క్ అంటూ కొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విక్రాంత్. హీరోగా పరిచయం అవుతూ రైటర్ గా స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేసిన విక్రాంత్ స్పార్క్ తో మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ . కథ : లేఖ (మెహ్రీన్ పిర్జాదా) తన కలలో వచ్చే డ్రీమ్ బాయ్ ను కలుసుకోవడం కోసం ఎదురుచూస్తుంటుంది. ఆమె తండ్రి 30 రోజుల్లో డ్రీమ్ బాయ్ ను కలుసుకోకపోతే ఇక తను చెప్పిన వాడిని వివాహం చేసుకోవాల్సిందే అని గడువు పెడతాడు. లేఖ కి అందుకోకుండా తన డ్రీమ్ బోయ్ ఆర్య (విక్రాంత్) రూపంలో పరిచయం అవుతాడు. మరో వైపు నగరంలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు. ఆర్య నే ఈ ఆత్మహత్యకు కారణం అని లేఖ తండ్రి అనుమాన పడతాడు. వైజాగ్ లో జయ్ , హైదరాబాద్ లో ఆర్యగా ఎందుకు మారాడు ? ఆర్య ఎవరు అతని కథేంటి ? అసలు ఈ మిస్టరీ మరణాల వెనుక ఎవరున్నారు?అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు: హీరో విక్రాంత్ కి హీరోగా డెబ్యూ సినిమా అయినప్పటికీ నటన పరంగా పరవాలేదనిపించాడు. నటుడిగా ఇంకాస్త నేర్చుకోవాలి కానీ మొదటి సినిమాతో పరవాలేదు అనిపించాడు.  మెహ్రీన్ మరియు రుక్సార్ ధిల్లాన్ చక్కగా కనిపించారు వారి పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించారు. వెన్నెల కిషోర్, సత్య కామెడీ అక్కడక్కడా నవ్వించింది. గురు సోమసుందరం మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు, అయితే అతని డబ్బింగ్ తేడా కొట్టింది. సుహాసిని కి మంచి కీలక పాత్ర దక్కడంతో ఆమె సర్ప్రయిజ్ చేసింది.

సాంకేతిక వర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ బాగావుంది. కొన్ని సీన్స్ లో కెమెరా విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన హేశమ్ అబ్దుల్ వహాద్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్, BGM ఇచ్చారు. ఎడిటింగ్ సినిమాకు మైనస్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. దీంతో సినిమా క్వాలిటీ పెరిగింది.

జీ సినిమాలు సమీక్ష : మేకర్స్ ఈ సినిమాపై భారీ ఖర్చు పెట్టారు, ప్రతి ఫ్రేమ్‌లో ఆ గ్రాండియర్ కనిపిస్తుంది. హీరో డెబ్యూ అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. గ్రాండ్‌ విజువల్స్‌, సాలిడ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ , పాటలను చిత్రీకరించిన విధానం ఐ ఫీస్ట్ గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే చివరి గంటలో మంచి సన్నివేశాలు ఉన్నాయి. స్పార్క్‌ ఫార్ములాతో వచ్చే కొన్ని ట్విస్టుల వర్కౌట్ అయ్యాయి.  సినిమాలో సస్పెన్స్, రొమాన్స్, కామెడీ ,యాక్షన్ వంటి అన్ని అంశాలను మిక్స్ చేశారు. కథ - కథనం కొత్తగా ఉన్నాయి. కానీ రైటింగ్ మీద ఇంకాస్త శ్రద్ద పెడితే బెటర్ గా ఉండేది. కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. స్పార్క్ మనకు 7త్ సెన్స్ మరియు థని ఒరువన్ వంటి సినిమాలను కూడా గుర్తు చేస్తుంది. ఇక ఎక్కువ రన్ టైం కూడా సినిమాకు ప్రధాన సమస్యగా మారింది. క్రిస్ప్ గా చెప్పే ప్రయత్నం చేసి మనకి బలమైన సన్నివేశాలు రాసుకుంటే ఔట్ పిట్ బాగుండేది. దాదాపు 3 గంటల రన్‌టైమ్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇరవై నిమిషాలు ట్రిమ్ చేసి ఉండాల్సింది. సినిమా ముగుస్తుంది అనుకున్నప్పుడే, కొన్ని ట్విస్ట్‌లతో ముందుకు సాగడం ఇబ్బంది పెడుతుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ చాలా మంచి పాటలు ఇచ్చాడు అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ ప్లస్ అయ్యాయి. స్పార్క్ కథ కొత్తది కాదు, కానీ ఎగ్జిక్యూషన్ బాగుంటే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయి ఉండేది. మొత్తంగా ‘స్పార్క్.. ది లైఫ్’ ఓ సరికొత్త పాయింట్ ని థ్రిల్లింగ్ గా చూపించిన మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు