Sidhhu Jonnalagadda’s ‘Tillu Square’ Movie Review

Friday,March 29,2024 - 01:27 by Z_CLU

నటీ నటులు : సిద్ధు జొన్నలగడ్డ , అనుమప పరమేశ్వరన్ , నేహా శెట్టి (గెస్ట్ రోల్) , ప్రిన్స్ , మురళి శర్మ , మురళీధర్ , ప్రణీత్ రెడ్డి, నర్రా శ్రీనివాస్ తదితరులు

కెమెరా : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

మ్యూజిక్ : రామ్ మిర్యాల , అచ్చు రాజమణి

నేపథ్య సంగీతం : భీమ్స్ సిసిరోలియో

ఎడిటింగ్ : నవీన్ నూలి

సమర్పణ : శ్రీకర స్టూడియోస్

నిర్మాణం : సితార ఎంటర్టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

నిర్మాత : నాగ వంశీ

రచన : సిద్దు జొన్నలగడ్డ , మల్లిక్ రామ్ , కళ్యాణ్ శంకర్ , ఆంటోనీ

దర్శకత్వం : మల్లిక్ రామ్

విడుదల : 29 మార్చ్ 2024

డీజే టిల్లు తో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ మళ్ళీ టిల్లు కేరెక్టర్ తో ఎంటర్టైన్ చేసేందుకు టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సీక్వెల్ అంచనాలను అందుకుండా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

టిల్లు పేరుతో ఈవెంట్స్ మొదలు పెట్టిన డీజే టిల్లు తన తండ్రితో కలిసి ఆ వ్యాపారం చూసుకుంటాడు. రాధికా మోసం తర్వాత కూల్ గా ఎంజాయ్ చేస్తూ సాగుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. పబ్ లో అనుకోకుండా పరిచయమిన లిల్లితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు టిల్లు. లిల్లీ కూడా టిల్లును ఇష్టపడుతుంది. ఒక నైట్ టిల్లుతో గడిపిన లిల్లీ సెక్స్ డే అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. సడెన్ గా మాయమైన లిల్లీ నెల తర్వాత తను ప్రెగ్నెంట్ అంటూ టిల్లు దగ్గరికి అవస్తుంది. దీంతో ఇద్దరు పెళ్ళికి రెడీ అవుతారు. కానీ లిల్లీ టిల్లు కి ఓ షాక్ ఇస్తుంది. రాధికా మోసం తర్వాత టిల్లు లైఫ్ ఎలా ఉంది ? తన లైఫ్ లోకి మరో గర్ల్ ఫ్రెండ్ గా వచ్చిన లిల్లీ ఎలాంటి షాక్ ఇచ్చింది ? మళ్ళీ టిల్లు ఎలా మోసపోయాడు ? అనేది మిగతా కథ...

నటీ నటుల పనితీరు :

సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి టిల్లు గా మెస్మరైజ్ చేశాడు. ఆల్రెడీ క్లిక్ అయిన కేరెక్టర్ తో మరోసారి పూర్తిగా మెప్పించాడు. డీజే టిల్లు లానే టిల్లు స్క్వేర్ లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెయిన్ హైలైట్ గా నిలిచాడు సిద్దు. అనుపమ పరమేశ్వరన్ కి మంచి పాత్ర దక్కింది. తను ఇప్పటి వరకూ చేసిన పాత్రలతో పోలిస్తే కాస్త డిఫరెన్స్ కనిపించింది. ముఖ్యంగా గ్లామర్ షో తో యూత్ ను ఎట్రాక్ట్ చేసింది. టిల్లు తండ్రి పాత్రలో మురళీధర్ , ఫ్రెండ్ పాత్రలో ప్రణీత్ రెడ్డి మంచి కామెడీ పండించారు. అతిథి పాత్రలో నేహా శెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. డాన్ గా కనిపించిన మురళి శర్మ , అలాగే మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక పనితీరు :

డీజే టిల్లుకి మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగా వర్క్ అయ్యింది. రిలీజ్ కి ముందే పాపులర్ సాంగ్ అనిపించుకుని ఓపెనింగ్స్ కి కూడా హెల్ప్ అయ్యింది. సీక్వెల్ కి ఆ రేంజ్ లో కాకపోయినా ఈసారి కూడా మ్యూజిక్ ప్లస్ అయ్యింది. రామ్ మిర్యాల , అచ్చు కంపోజ్ చేసిన టికెట్టే కొనకుండా ..., రాధికా సాంగ్స్ బాగున్నాయి. ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఓ మై లిల్లీ సాంగ్ పరవాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్స్ ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా వర్క్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. కొన్ని డైలాగ్స్ పేలాయి. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీ గా ఎక్కడా డ్రాగ్ లేకుండా ఉంది.

డైరెక్టర్ మల్లిక్ రామ్ సీక్వెల్ ను బాగా హ్యాండిల్ చేశాడు. సిద్దు , మిగతా రచయిత సహాయంతో దర్శకుడిగా పాస్ అయిపోయాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా క్వాలిటీ ను పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

జనాల్లోకి బాగా వెళ్లిపోయిన కేరెక్టర్ తో మళ్ళీ ఓ బస్టర్ బస్టర్ డెలివరీ చేయడం ఎవరికైనా కాస్త టఫ్. అందుకే సిద్దు దర్శకుడు మల్లిక్ టిల్లు స్క్వేర్ సీక్వెల్ పై మదన పడుతూ వర్క్ చేశారు. ఒక ఐకానిక్ కేరెక్టర్ ను ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ తీసుకొని దాని చుట్టూ స్క్రీన్ ప్లే అల్లడం కష్టమే. కానీ ఇష్టంతో ఆ కష్టాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మరోసారి మెప్పించారు సిద్ధూ దర్శకుడు మల్లిక్.

నిజానికి ఈ సీక్వెల్ కి మొదటి పార్ట్ తో కూడిన మంచి కనెక్షన్ కుదరడంతో సిద్ధూ కి దర్శకుడు మల్లిక్ కి తమ జాబ్ కాస్త ఈజీ అయ్యి ఉండొచ్చు. మంచి కథ కుదరడంతో స్క్రీన్ ప్లే బాగా సెట్ చేసుకున్నారు. టిల్లు పాత్ర గురించి ప్రేక్షకుల ముందుకులకి తెలుసు కాబట్టి ఆ కేరెక్టర్ గురించి ఎక్కువ సీన్స్ రాసుకొని టైం తీసుకోకుండా నేరుగా కథలోకి వెళ్లారు. సినిమా ఎంత ఫాస్ట్ గా మొదలైందో అంతే ఫాస్ట్ గా ముగుస్తుంది. మధ్యలో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ తో కొన్ని బ్లాక్స్ పెట్టుకొని టికెట్టు కొన్న ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు.

లిల్లీ పాత్ర బాగుంది. ఆ పాత్రలో అనుపమ కొత్తగానే కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నటిగా ఆకట్టుకుంది కానీ గ్లామర్ షో తోనే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆ పాత్రతో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్ట్ వర్కౌట్ అయ్యింది. మొదటి పార్ట్ డీజే టిల్లు కి సెకండాఫ్ లో వచ్చే కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకొని సిద్ధూ ఈసారి సెకండాఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. రెండో భాగంలో అనుపమ తో వచ్చే కన్వర్సేషన్ , అలాగే రాధికగా నేహా శెట్టి స్పెషల్ ఎంట్రీ , ఆ తర్వాత టిల్లు -రాధికా మధ్య వచ్చే సన్నివేశం సెకండాఫ్ లో హైలైట్స్ గా నిలిచాయి. అలాగే రాధికా సాంగ్ కూడా సెకండాఫ్ లో వర్క్ అయ్యింది.

ఓవరాల్ గా డీజే టిల్లు గా ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధూ మరోసారి ఆ ఐకానిక్ కేరెక్టర్ తో మళ్ళీ మంచి వినోదం అందించి మెప్పించి నటుడిగా , రచయితగా సక్సెస్ అయ్యాడు. ఫైనల్ గా టిల్లు గాడు మళ్ళీ బాగా ఎంటర్టైన్ చేసి థియేటర్స్ నుండి బయటికి పంపిస్తాడు. సమ్మర్ లో కూల్ హిలేరియస్ ఫన్ పక్కా..

రేటింగ్ : 3 / 5