Siddhu Jonnalagadda’s ‘DJ Tillu’ movie review

Saturday,February 12,2022 - 01:32 by Z_CLU

నటీ నటులు : సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు .

సంగీతం: శ్రీచరణ్ పాకాల

నేపథ్య సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు

సమర్పణ: పి. డి. వి. ప్రసాద్

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ

మాటలు: సిద్దు జొన్నలగడ్డ

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం: విమల్ కృష్ణ

సాంగ్స్ , ట్రైలర్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన 'DJ టిల్లు' ఈ రోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం సిద్దు హీరోగా నటించడమే కాకుండా రైటర్ గా కూడా వర్క్ చేశాడు. మరి సిద్దు కి అలాగే కొత్త దర్శకుడు విమల్ కి ఈ సినిమా సక్సెస్ అందించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

dj tillu

కథేంటి ? 

మల్కాజ్ గిరి కి చెందిన బాలగంగాధర్ తిలక్(సిద్దు జొన్నలగడ్డ) లోకల్ ఈవెంట్స్ లో DJ ప్లే చేస్తూ DJ టిల్లుగా చలామణి అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ పబ్ సింగర్ రాధిక(నేహా శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. రాధిక కూడా డీజే టిల్లుని ఇష్టపడుతుంది. అయితే అనుకోని విధంగా వీరిద్దరికి ఓ మర్డర్ కేసు చుట్టుకుంటుంది. దీంతో షాన్(ప్రిన్స్) ,  పోలీస్ ఆఫీసర్  రావు(బ్రహ్మాజీ), చంద్రకాంత్ (నర్రా శ్రీనివాస్) ఇలా ముగ్గురు టిల్లు, రాధికల వెంట పడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారి నుండి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు టిల్లు, రాధిక.

ఇంతకీ మర్డర్ అయిన వ్యక్తి ఎవరు ?  ఆ మర్డర్ కి వీరిద్దరికీ సంబంధం ఏమిటి ? రాధిక టిల్లుని ఎలా బుక్ చేసింది ? ఆ ముగ్గురు వీళ్ళ వెంట ఎందుకు పడతారు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

DJ టిల్లు గా సిద్దు మంచి నటన కనబరిచాడు. తెలంగాణా యాసలో మాట్లాడుతూ ఆ  క్యారెక్టర్ లో ఒదిగిపోయి సినిమాకు మెయిన్ పిల్లర్ లా నిలిచాడు.  సిద్దు నటన , డైలాగ్ డెలివరీ సినిమాకే హైలైట్. రాధిక పాత్రలో నేహా శెట్టి సినిమాకు ప్లస్ అయ్యింది.  గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ కి తన పెర్ఫార్మెన్స్ తో బెస్ట్ ఇచ్చింది. రావు పాత్రలో బ్రహ్మాజీ , షాన్ పాత్రలో ప్రిన్స్, చంద్రకాంత్ పాత్రలో నర్రా శ్రీనివాస్, జడ్జ్ పాత్రలో ప్రగతి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో తండ్రి పాత్రలో నటించిన మురళి కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు టెక్నికల్ సపోర్ట్ బాగా అందింది. ముఖ్యంగా సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. రామ్ మిర్యాల పాడుతూ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ తో పాటు శ్రీ చరణ్ కంపోజ్ చేసిన "పటాసు పిల్లా" సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఆ సాంగ్ అనిరుద్ పాడటంతో మరింత అందం వచ్చింది. కాసర్ల శ్యామ్ , కిట్టు అందించిన లిరిక్స్ బాగున్నాయి.  తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తూ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సాయిప్రకాష్ ఉమ్మడి సింగు కెమరా వర్క్ బాగుంది. నైట్ ఎఫెక్ట్స్ షాట్స్ లో అతని పనితనం కనిపించింది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.

విమల్ , సిద్దు రాసుకున్న కథ రొటీన్ అనిపించినప్పటికీ  స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అలాగే సిద్దు డైలాగ్స్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. తన డైలాగ్స్ తో క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు సిద్దు. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

dj tillu

జీ సినిమాలు రివ్యూ : 

సిద్దు ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అతని టాలెంట్ కి అనుకున్నంత గుర్తింపు రాలేదు. అందుకే తనే రైటర్ మారి స్నేహితుడు విమల్ కృష్ణ తో కలిసి ఈ కథను సిద్దం చేసుకొని వర్కౌట్ చేశాడు. ఈ సినిమా కోసం విమల్ , సిద్దు రొటీన్ క్రైం కామెడీనే తీసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నారు. ముఖ్యంగా కథలో వచ్చే ఫన్ తో థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడిని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశారు. సిద్దు డైలాగ్ కామెడీ సినిమాని సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్ళింది. డీజేటిల్లు క్యారెక్టర్ డిజైనింగ్ , కామెడీ , బోర్ కొట్టకుండా నడిచే కథ సినిమాను నిలబెట్టేశాయి.

ఒక మర్డర్, దాని చుట్టూ జరిగే కామెడీ, నాలుగు క్యారెక్టర్స్ ఇలా  క్రైం కామెడీ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. OTT లో ఉండటంతో  అన్ని భాషల్లో వచ్చిన ఈ జోనర్ సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆడియన్స్ చూసేశారు. కానీ ఈ లైన్ పట్టుకొని దానికి కొత్త ట్రీట్ మెంట్ ఇచ్చి యూత్ ఆడియన్స్ తో పాటు అందరినీ ఎంటర్టైన్ చేసేలా సినిమాను రెడీ చేశారు విమల్ , సిద్దు. ట్రైలర్ ని రొమాంటిక్ గా కట్ చేసి ఇది యూత్ సినిమా అన్నట్టు ప్రొజెక్ట్ చేసిన దర్శకుడు సినిమాలో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి ఇది మంచి ఎంటర్టైనర్ అని ఫీలయ్యేలా చేశాడు. తమ సినిమా కోసం టైం ఇచ్చిన ప్రేక్షకుడిని నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకొని ఈ సినిమా చేశారు సిద్దు , విమల్ కృష్ణ. అందులో పూర్తిగా సక్సెస్ అయ్యారు ఈ ఇద్దరు.

స్క్రీన్ ప్లే తో పాటు క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా బాగుంది. బ్రహ్మాజీ పాత్రని కూడా బాగానే వాడుకున్నారు. కాకపోతే  ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన దర్శకుడు సెకండాఫ్ కొచ్చే సరికి కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి కథ తీసుకొని సెకండాఫ్ కూడా బోర్ కొట్టకుండా నడిపించడం గొప్ప విషయమే. అందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. క్లైమాక్స్ ని కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. కోర్టులో వచ్చే క్లైమాక్స్ ని కూడా కామెడీగానే రాసుకొని సీక్వెల్ కి హింట్ ఇచ్చాడు దర్శకుడు. కామెడీ మీద బేస్ అయి నడిచే ఇలాంటి కథలో లాజిక్స్ పట్టించుకోరు ఆడియన్స్. కేవలం ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కోరుకుంటారు. అది కూడా సినిమాకు కలిసొచ్చిన అంశమే అనుకోవచ్చు.  ఫైనల్ గా DJ టిల్లు ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్వించి ఇంటికి పంపుతాడు.

బాటమ్ లైన్ : ఎంటర్టైన్ మెంట్ ఫుల్లు

రేటింగ్ : 3 /5

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics