Movie Review – Sarpatta

Friday,July 23,2021 - 02:18 by Z_CLU

నటీనటులు: ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, జాన్‌ కొక్కెన్‌ తదితరులు సంగీతం : సంతోష్‌ నారాయణ్‌ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్‌ : సెల్వ ఆర్‌.కె నిర్మాణం : నీలం ప్రొడక్షన్స్‌, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్‌ రాజ్‌ దర్శకత్వం : పా.రంజిత్‌ విడుదల తేది : 22-07-2021 రన్ టైమ్: 2 గంటల 45 నిమిషాలు

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు మనకు కొత్త కాదు. చాలానే వచ్చాయి. మరీ ముఖ్యంగా వారం కిందటే తూఫాన్ పేరిట పేరిట ఓ బాక్సింగ్ మూవీ వచ్చింది. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లో సార్పట్ట పేరుతో మరో బాక్సింగ్ మూవీ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ గా వచ్చింది. మరి ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

arya Sarpatta movie telugu review zeecinemalu 1

కథ

బ్రిటిషర్లు తమ సరదా కోసం కొంతమంది భారతీయులకు బాక్సింగ్ నేర్పిస్తారు. అలా తమిళనాడుకు చెందిన సార్పట్ట పరంపర, ఇడియప్ప కుటుంబాలు బాక్సింగ్ ను నేర్చుకొని అనాదిగి కొనసాగిస్తుంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ బాక్సింగ్ రచ్చ నడుస్తూనే ఉంటుంది. వీళ్లలో సార్పట్ట కు చెందిన వ్యక్తి సమరన్.

అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు. ఆ టైమ్ లో హార్బర్ లో కూలీగా చేస్తుంటాడు సమరన్ (ఆర్య). ఇతడికి బాక్సింగ్ అంటే పిచ్చి. కానీ తల్లి మాత్రం అతడ్ని బాక్సింగ్ వైపు వెళ్లనివ్వదు. ఎఁదుకంటే, బాక్సింగ్ మూలంగానే భర్తను కోల్పోతోంది కాబట్టి. అయితే ఓ అనుకోని ఘటనతో సమరన్ బాక్సర్ గా మారాల్సి వస్తుంది. ఇడియప్పకు చెందిన వేటపులి (జాన్ కొక్కెన్)తో తలపడాల్సి వస్తుంది. మరి బాక్సర్ గా మారేందుకు తల్లిని సమరన్ ఒప్పించాడా? అతడు ఎఁదుకు బాక్సర్ గా మారాల్సి వచ్చింది? ఫైనల్ గా అతడు ఏం సాధించాడనేది సార్పట్ట స్టోరీ

నటీనటుల పనితీరు

నటుడిగా ఆర్యను ఓ మెట్టు పైకి ఎక్కించింది ఈ సినిమా. ఈ మూవీ కోసం అతడి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. బాక్సర్ ఫిజిక్ కోసం కష్టపడ్డమే కాకుండా, నటన పరంగా కూడా ఆర్య మంచి మార్కులు సాధించాడు. బాక్సర్ గా అతడి బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. దీనికితోడు సినిమాలోని ఓ షేడ్ లో చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగా కూడా చక్కగా నటించాడు.

ఆర్య భార్యగా దుషారా విజయన్ బాగా చేసింది. సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, జాన్‌ విజయ్‌, షబ్బీర్‌లు తమ పాత్రల మేరకు నటించారు. ఆంగ్లో ఇండియన్‌గా జాన్‌ విజయ్‌ డైలాగ్స్ అలరిస్తాయి. డ్యాన్సింగ్‌ రోజ్‌గా షబ్బీర్‌ నటన కామెడీ పంచుతుంది. ఇక కోచ్‌ రంగయ్య పాత్రలో పశుపతి యాక్టింగ్ బాగుంది.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆర్ట్ డైరక్టర్ రామలింగం. 70ల కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకుకట్టేలా సెట్స్ వేశాడు రామలింగం. అతడి ఆర్ట్ వర్క్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. దీన్ని మరింత ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్, కలర్ టోన్ కుదిరాయి. ఇక రెండో వ్యక్తి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటే, సినిమా అంత ఎలివేట్ అవుతుంది. ఈ విషయంలో సంతోష్ నారాయణన్ కు వందకు వంద మార్కులు వేయాల్సిందే. సినిమాకు అతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్. ఇక దర్శకుడి విషయానికొస్తే, పా.రంజిత్ ఈ స్పోర్ట్స్ డ్రామాను బాగా రాసుకున్నాడు కానీ ఫస్టాఫ్ లో కనిపించినంత ఉత్సాహం సెకెండాఫ్ లో కనిపించలేదు. ఇతడి సినిమాల్లో ఎక్కువగా కనిపించే సెకెండాఫ్ డ్రాగ్ అనే ఎలిమెంట్ సార్పట్టలో కూడా కనిపించింది.

arya Sarpatta movie telugu review zeecinemalu 1

జీ సినిమాలు రివ్యూ

ఇంతకుముందు పా.రంజిత్ దర్శకత్వంలో కాలా, కబాలి సినిమాలొచ్చాయి. సార్పట్టను కూడా అలానే ఊహించుకొని చూస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, ఆ రెండు రజనీకాంత్ సినిమాలు. ఇది ఆర్య సినిమా. ఆర్య స్టార్ కాదు. ఈ విషయం పా రంజిత్ కు బాగా తెలుసు. అందుకే సార్పట్ట సినిమాను కేవలం పాత్రల మీద నడిపించాడు. ఇందులో హీరోల కంటే పాత్రలే కనిపిస్తాయి. ప్రతి పాత్రకు వెయిట్ ఇచ్చాడు, ప్రతి పాత్రను పండించాను. అందుకే సార్పట్టతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు సెకండాఫ్ కు వచ్చేసరికి ఈ దర్శకుడిలో ఒక రకమైన నీరసం లేదా భయం ఆవహిస్తున్నట్టుంది. అమాంతం సన్నివేశాలు సాగదీస్తున్నాడు, రన్ టైమ్ పెంచేస్తున్నాడు. సార్పట్ట సెకెండాఫ్ లో అది కనిపించింది. ఈ సినిమా 12 నిమిషాలు తక్కువగా 3 గంటలు నిడివి ఉంది. అంతసేపు సినిమా చూడడం కష్టం. ఓటీటీలో ఉంది కాబట్టి అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వాడ్ చేసుకునే వెసులుబాటు ఉండడం అదృష్టం.

ఆర్య ఈ సినిమాకు ప్రాణం పోశాడు. తనకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో అతడు పనిచేశాడు. అటు పా రంజిత్ కూడా ఏ పాత్రకు ఏ నటుడితై ప్రాణం పోస్తాడో రీసెర్చ్ చేసి మరీ నటీనటుల్ని ఎంపిక చేసుకున్నట్టున్నాడు. మూవీలో ప్రతి పాత్ర తనదైన ముద్ర వేస్తుంది.

ప్లస్ పాయింట్స్ - ఫస్టాఫ్ - ఆర్య యాక్టింగ్ - ఇతర నటీనటుల నటన - దర్శకత్వం - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్ - రన్ టైమ్ - సెకెండాప్ లో సాగదీత

బాటమ్ లైన్ - ఫీల్ గుడ్ స్పోర్ట్స్ డ్రామా రేటింగ్ - 3/5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics