Samantha’s ‘Yashoda’ Movie Review

Friday,November 11,2022 - 02:37 by Z_CLU

నటీ నటులు : సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు.

సంగీతం : మణిశర్మ

మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి

పాటలు : రామజోగయ్య శాస్త్రి

కెమెరా : ఎం. సుకుమార్

సహ నిర్మాత : చింతా గోపాలకృష్ణారెడ్డి,

నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

దర్శకత్వం: హరి మరియు హరీష్

విడుదల తేది :  11 నవంబర్ 2022

సెన్సార్ : UA

రన్ టైం : 135 నిమిషాలు

సమంత టైటిల్ రోల్ లో నటించిన యశోద ఓ మోస్తారు అంచనాల నడుమ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ సమంత ఈ సినిమా కోసంస్పెషల్ కేర్ తీసుకొని వర్క్ చేసింది. మరి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'యశోద' తో సమంత మెప్పించిందా ? సామ్ కష్టానికి ఫలితం దక్కిందా ? జీ సినిమాలు ఎక్స్ కూసివ్ రివ్యూ.

కథ : 

పేదరికం వల్ల డబ్బు కోసం సరోగసి పద్ధతితో తల్లిగా మారేందుకు ఒప్పుకొని ఇవ సెంటర్ లో అడుగుపెడుతుంది యశోద (సమంత).  సరోగసి పేరుతో ఆ ల్యాబుల్లో ఏదో జరుగుతుందని గమనించిన యశోద అందులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మరో వైపు పోలీస్ ఆఫీసర్ రిషి (శత్రు) వాసుదేవ్ (సంపత్ రాజ్) ఒక మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అసలు యశోద ఎవరు ?  సరోగసి ముసుగులో పరిశోధనలు చేస్తున్న మధుబాల పై ఎదురు తిరిగి అసలు విషయాన్ని ఎలా బయటపెట్టింది ? ఆ మర్డర్ కి సరోగసి సెంటర్ కి లింక్ ఏంటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

యశోద పాత్రలో సమంత బెస్ట్ అనిపించుకుంది. ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. యాక్షన్ ఎపిసోడ్ లో సమంత కష్టం కనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకుంది. గౌతం పాత్రలో ఉన్ని ముకుందన్ నటన బాగుంది. నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటి లానే ఆకట్టుకుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె సన్నివేశాలు మెప్పించలేకపోయాయి. రావు రమేష్  తన డైలాగ్ డెలివరీ తో అలరించాడు. రావు రమేష్ డైలాగులు కొన్ని చోట్ల పేలాయి. చిన్న పాత్రే అయినప్పటికే కథను మలుపు తిప్పే పాత్రలో ప్రీతీ అశ్రాని ఆకట్టుకుంది. మురళి శర్మ, సంపత్ రాజ్ , శత్రు, జోష్ రవి, కల్పిక , దివ్య, మధురిమ తదితరులు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎం. సుకుమార్ విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా సెట్ లో తీసిన సన్నివేశాలను  బాగా చూపించారు. అశోక్ ఆర్ట్ వర్క్ సినిమాకు హైలైట్. ఇవ సెంటర్ సెట్ రిచ్ గా ఉంది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ పరవాలేదు కానీ  కొన్ని సన్నివేశాలను స్పీడప్ చేసి ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. వెంకట్, యానిక్ బెన్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

పులగం చిన్నారాయణ , డా చల్లా భాగ్యలక్ష్మి అందించిన మాటలు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. దర్శకులు హరి -హరీష్ లు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే -సన్నివేశాలపై ఇంకాస్త ఫోకస్ పెట్టి వర్క్ చేసి ఉంటే బాగుండేది. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సమంత లేడీ ఓరియంటెడ్ సినిమా ఎంచుకుందంటే అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ఇది వరకూ ఆమె చేసిన 'యూ టర్న్' , 'ఓ బేబీ' సినిమాలే ఇందుకు ఉదాహరణ.  యశోద లో కూడా కొత్త కంటెంట్ ఉంది. ఈసారి కంప్లీట్ థ్రిల్లర్ జాన్ర్ లో సినిమా చేసింది సమంత. కానీ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో టీజర్ , ట్రైలర్ తో మోస్తారు అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా యావరేజ్ అనే బోర్డర్ దగ్గరే నిలిచిపోయింది. దర్శకులు హరి -హరీష్ మంచి కథే ఎంచుకున్నారు. కథలో ముఖ్యమైన పాత్రలకు తగ్గట్టే నటీ నటులను తీసుకొని వారి నుండి బెస్ట్ రాబట్టారు. కాకపోతే స్క్రీన్ ప్లే లో కొన్ని లోపల కారణంగా, కథను డ్రాగ్ చేసి చూపించడం , బోర్ కొట్టే సన్నివేశాల వల్ల సినిమా ఓ మోస్తారుగా ఆకట్టుకుంటుంది తప్ప మెస్మరైజ్ చేయలేకపోయింది.

రిలీజ్ కి ముందు సరోగసి పాయింట్ ను హైలైట్ చేస్తూ ప్రమోట్ చేసిన దర్శకులు సినిమాలో ఆ పాయింట్ తో లింక్ చేసి ఇంకో డిఫరెంట్ కథ చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే  అది గతంలో చూసిన కొన్ని థ్రిల్లర్ సినిమాలను గుర్తుచేసేలా ఉంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లిక్ అవ్వకపోవడం సినిమాకు ప్రధాన మైనస్. ఫ్లాష్ బ్యాక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కేరెక్టర్ డిజైనింగ్ ప్రాపర్ గా కుదరలేదు. ఆ ఎపిసోడ్ లో రావు రమేష్ కేరెక్టర్ , డైలాగ్స్ అలరిస్తాయి. అలాగే కథలో ఎమోషన్ పండలేదు. ఇక థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే రేసీ స్క్రీన్ ప్లే ఇందులో లేకపోవడం కొన్ని సన్నివేశాలు మరీ నత్తనడక సాగడం మైనస్ అనిపించాయి.

సమంత నటన , కథ , యాక్షన్ , ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ , మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనిపిస్తాయి. ఓవరాల్ యశోద  సై -ఫై థ్రిల్లర్ గా పరవాలేదనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5