Pradeep Ranganathan’s ‘Love Today’ Telugu Review

Friday,November 25,2022 - 04:21 by Z_CLU

నటీ నటులు : ప్రదీప్ రంగనాథన్ , ఇవన , సత్య రాజ్ , రాధిక, యోగి బాబు, రవీన రవి, తదితరులు

కెమెరా : దినేష్ పురుషోత్తం

మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

ఎడిటింగ్ : ప్రదీప్ ఈ రాఘవ్

నిర్మాతలు : కాల్పతి అగోరం , కాల్పతి గణేష్ , కాల్పతి సురేష్

విడుదల : SVC

నిడివి : 155 నిమిషాలు

సెన్సార్ : UA

విడుదల తేది : 25 నవంబర్ 2022

తమిళ్ లో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్న 'లవ్ టుడే' డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ ట్రెండీ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా ? మల్టీ టాలెంటెడ్ ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) , నిఖిత (ఇవన) ఇద్దరూ ప్రేమలో ఉంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు ఓ సందర్భం చూసి చెప్పాలనుకుంటారు. ఈ లోపు నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్య రాజ్) కి వీరిద్దరి ప్రేమ సంగతి తెలుస్తుంది. ప్రదీప్ ని ఇంటికి పిలిచి ఇద్దరి ఫోన్స్ చేంజ్ చేసుకోమని కొన్ని గంటల తర్వాత ఇద్దరూ తమకి ఓకే అంటే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్తాడు.

మరి ఫోన్స్ మార్చుకున్న కొన్ని గంటల్లో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి ? వాటికి కారణం ఏమిటి ?  ఫైనల్ గా ప్రదీప్ నిఖిత ఎలా ఒకటయ్యారు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

హీరో ప్రదీప్ రంగనాథన్ కథకి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ప్రదీప్ పాత్రలో మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. కాకపోతే కామెడీ పండించినంతగా ఎమోషన్ పండించలేకపోయాడు ప్రదీప్. నిఖిత పాత్రలో ఇవన మంచి నటన కనబరిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.  సత్య రాజ్ , రాధిక ఇద్దరూ తమ ఎక్స్ పీరియన్స్ తో పాత్రల్లో ఒదిగిపోయారు. యోగిబాబు తన పెర్ఫార్మెన్స్ తో నవ్వించాడు. రవీన రవి , అక్షయ ఉదయ కుమార్ , ఆదిత్య , భరత్ , అజీద్ ఖలి, ప్రార్ధన నాథన్ , విజయ్ వరద రాజన్ తదితరులు తన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరీ కయినా మంచి ఫీల్ కలిగించే మ్యూజిక్ పడితే రిజల్ట్ బెటర్ గా ఉంటుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది. చాలా వరకు సన్నివేశాలను ఎలివేట్ చేస్తూ కామెడీ కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు యువన్. కంపోజ్ చేసిన ట్రెండీ సాంగ్స్ కూడా బాగున్నాయి. దినేష్ పురుషోత్తం విజువల్స్ , ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాగున్నాయి. శశి కిరణ్ రాసిన తెలుగు డైలాగ్స్ బాగున్నాయి. తెలుగు ట్రెండ్ కి తగ్గట్టుగా శశి రాసిన కొన్ని మాటలు థియేటర్స్ లో పేలాయి.

ప్రదీప్ రంగనాథన్ ఎంచుకున్న ట్రెండీ లవ్ స్టోరీకి అతను రాసుకున్న స్క్రీన్ ప్లే , సన్నివేశాలు మరింత బలం చేకూర్చాయి. ప్రదీప్ రైటర్ గా డైరెక్టర్ రెండు విభాగాల్లో బెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు  రివ్యూ :

ప్రస్తుతం చూస్తున్న ట్రెండీ లవ్ స్టోరీస్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ పిక్ చేసుకొని ఈరోజుల్లో లవ్ అనేది ఎలా ఉందో ఎంటర్టైనింగ్ గా చూపించే ప్రయత్నం చేసి రైటర్ గా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. ఎంచుకున్న పాయింటే అతనికి సగం విజయాన్ని కట్టబెట్టింది. మిగతా సగం తన నటనతో అలాగే టేకింగ్ తో సక్సెస్ చేసుకున్నాడు.

ఒకరంటే ఒకరికి ప్రాణం... త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో మొబైల్ మార్పిడి కారణంగా ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుస్తుంది. మరి ఈ చిక్కు నుండి ఇద్దరూ ఎలా బయటికొచ్చి మళ్ళీ ఒకటయ్యారు ? అనే పాయింట్ తీసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా రాసుకొని మెస్మరైజ్ చేశాడు దర్శకుడు. ప్రదీప్ రాసుకున్న స్క్రీన్ ప్లే రైటింగ్ మెప్పిస్తుంది. కథను నడిపించిన తీరు , ఊహించని టర్నింగ్ పాయింట్స్ అలరిస్తాయి. మొబైల్ మీద బేస్ చేసుకొని కథ రాసుకున్న ప్రదీప్  నమ్మకం అనే లేయర్ పెట్టుకొని సినిమాకు పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు.

యూత్ ఫుల్ ట్రెండీ కథ కావడంతో యూత్ కి నచ్చేలా  సన్నివేశాలు ప్లాన్ చేసుకున్నాడు ప్రదీప్. ముఖ్యంగా నేటి తరం యువతను అద్దం పట్టేలా రాసుకున్న సన్నివేశాలు థియేటర్స్ లో బాగా పేలాయి. సినిమా ఆరంభంలో చిన్న పిల్లాడు మామిడి కాయ తినేసి భూమిలో పాతేసి చెట్టు కోసం ఎదురుచూసే సన్నివేశంతో సినిమా మొదలుపెట్టిన ప్రదీప్ ఆ తర్వాత ప్రేమ సన్నివేశాలు , ఇద్దరి ఫ్యామిలీ గురించి చూపిస్తూ సరదగా నడిపించాడు. సత్య రాజ్ పాత్రను బాగా డిజైన్ చేశాడు. ఆ కేరెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

నిఖిత తండ్రి వేణు శాస్త్రికి ఇద్దరు లవ్ గురించి తెలియడం ప్రదీప్ ను ఇంటికి పిలవడం నుండి ఎండింగ్ వరకు సినిమా ఆధ్యంతం వినోద భరితంగా సాగింది. చివర్లో నమ్మకం గురించి హీరో తల్లి పాత్రతో చెప్పించే సీన్ తో పాటు ఆరంభంలో చూపించిన చిల్ల పిల్లాడి షాట్స్ కి మీనింగ్ చెప్పేలా క్లైమాక్స్ లో వచ్చే చెట్టు సీన్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతీ కేరెక్టర్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని వాటి ద్వారా మంచి ఫన్ క్రియేట్ చేశారు. నేటితరం కుర్రకారు చేసే అల్లరి చేష్టలు స్క్రీన్ పైకి తీసుకురావడంలో ప్రదీప్ బాగా సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా 'లవ్ టుడే' నేటితరం కుర్రకారుని బాగా ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో ఫైనల్ గా ఇచ్చిన సందేశం బాగుంది.

రేటింగ్ : 3 /5