Movie Review – Shekar

Friday,May 20,2022 - 03:27 by Z_CLU

నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవివర్మ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని ఆర్ట్: సంపత్ రైటర్: లక్ష్మీ భూపాల సెన్సార్: U/A రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు రిలీజ్ డేట్: మే 20, 2022

రాజశేఖర్ కు రీమేక్స్ కొత్తకాదు. తనకు కొత్తగా అనిపించిన ప్రతిసారి రీమేక్ చేశాడు. ఈసారి కూడా ఓ మలయాళీ సినిమా డిఫరెంట్ గా అనిపించింది. అదే శేఖర్ సినిమాగా వచ్చింది. మరి ఈ సినిమాతో యాంగ్రీ మేన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

SHEKAR movie rajasekhar

కథ

పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు శేఖర్. అయితే అతడు రిటైర్ అయినప్పటికీ డిపార్ట్ మెంట్ అతడి సేవల్ని వినియోగించుకుంటుంది. ఎందుకంటే, క్రైమ్ కేసుల్ని సాల్వ్ చేయడంలో శేఖర్ తర్వాతే ఎవరైనా. ఓసారి ఇలానే ఓ యాక్సిడెంట్ కేసు కోసం వెళ్తాడు శేఖర్. అది ఆమె ఎక్స్-వైఫ్ అని తెలుసుకొని బాధపడతాడు. అయితే ఆ యాక్సిడెంట్ పై శేఖర్ కు అనుమానాలుంటాయి. దీంతో తనే సొంతంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో తన కూతురు మరణం కూడా ఈ కేసుకు కనెక్ట్ అయి ఉందని తెలుసుకుంటాడు. ఈ కేసును ఛేదించడం కోసం శేఖర్ ఎలాంటి సాహసం చేశాడు? ఫైనల్ గా కేసును ఎలా సాల్వ్ చేశాడనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

రాజశేఖర్ తన వయసుకు తగ్గ పాత్ర ఎంచుకున్నారు. అలా అని సినిమా మొత్తం ఆ నెరిసిన గడ్డంతో కనిపించరాయన. ఆయన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఓ కూతురుకు తండ్రిగా, పోలీస్ ఆఫీసర్ గా, ప్రియుడిగా, భార్యను దూరం చేసుకున్న భర్తగా.. ఇలా ప్రతి వేరియేషన్ లో రాజశేఖర్ ది బెస్ట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే రాజశేఖర్ ఎక్స్ పీరియన్స్ కనిపిస్తుంది.

సినిమా మొత్తం రాజశేఖర్ చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఇతర పాత్రలకు పెద్దగా స్కోప్ దక్కలేదు. అయినప్పటికీ శివానీ రాజశేఖర్, ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్ ఆకట్టుకున్నారు. రాజశేఖర్ స్నేహితులుగా అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్ బాగా చేశారు. ముస్కాన్ సేథీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా బ్యాక్ డ్రాప్ తో, కథతో ఆమె సింక్ అవ్వలేకపోయింది.

టెక్నీషియన్స్ పనితీరు

సినిమా కథకు తగ్గట్టు టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. తొలిసారి రాజశేఖర్ సినిమాకు వర్క్ చేసిన అనూప్ రూబెన్స్, రాజశేఖర్ ఇమేజ్ తో సంబంధం లేకుండా తన మార్క్ బాణీలు అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ గాడి తప్పినప్పటికీ, ఓవరాల్ గా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ వర్క్ ఇంకా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్... రీమేక్ ను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసినట్టున్నారు. లక్ష్మీభూపాల డైలాగ్స్ బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి టాలెంట్ కనిపిస్తుంది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

Rajasekhar Shekar Movie ready for Sankranthi Release

జీ సినిమాలు రివ్యూ

రీమేక్స్ విషయంలో ఇతర హీరోలకు, రాజశేఖర్ కు మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో రాజశేఖర్ ఎంచుకున్న రీమేక్స్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అందుకే మలయాళ సినిమా జోసెఫ్ ను రాజశేఖర్ సెలక్ట్ చేసుకున్నాడని తెలిసిన వెంటనే చాలామంది ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ పెట్టారు. మరికొంతమంది ముందుగానే జోసెఫ్ మలయాళం వెర్షన్ చూశారు. అలా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమాను రాజశేఖర్ తన నటనతో నిలబెట్టారు. కానీ ఈ సినిమా నిలబడ్డానికి ఇది మాత్రమే చాలదు.

మలయాళీ సినిమా జోసెఫ్ ను దాదాపు ఫాలో అయి తీయడం ఈ సినిమాకు సమస్యగా మారింది. మలయాళీ సినిమాల్లో ఉన్న స్క్రీన్ ప్లే, కథలు తెలుగు ఆడియన్స్ కు వర్కవుట్ అవుతాయి కానీ, వాళ్ల స్టయిల్ ఆఫ్ మేకింగ్, నెరేషన్ టాలీవుడ్ కు అస్సలు సూట్ కావు. ఈ విషయంలో దర్శకురాలు జీవిత రాజశేఖర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది. దాదాపు అదే స్టయిల్ ఫాలో అవ్వడంతో సినిమాలో వేగం మిస్సయింది. దీనికితోడు సెటప్ ను కూడా నేటివిటీకి తగ్గట్టు మార్చలేకపోవడం మరో సమస్య.

రాజశేఖర్ ను పరిచయం చేయడమే ఓల్డ్ లుక్ లో పరిచయం చేశారు. అలా చేయడం వల్ల ఆడియన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేసినట్టయింది. పైగా అది మంచి ఎత్తుగడ కూడా అనిపించుకుంది. రిటైర్డ్ పోలీస్ అధికారిగా రాజశేఖర్ ను చూపించడం, అతడు కేసుల్ని ఛేదించే విధానాన్ని బాగా రీమేక్ చేశారు జీవిత. ఇక అక్కడ్నుంచి దాదాపు ఒరిజినల్ సినిమా ఫార్మాట్ నే ఫాలో అయ్యారు. మధ్యమధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ లోకి వెళ్లడం, తిరిగి వర్తమానంలోకి రావడం లాంటివి బాగున్నాయి.

ప్రారంభంలో మెల్లగా మొదలైన సినిమా, ఇంటర్వెల్ కు వచ్చేసరికి బాగా ఆసక్తి పెంచుతుంది. ఇంటర్వెల్ కార్డుతో మంచి ట్విస్ట్ ఇస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత తిరిగి అదే పేజ్ ను కొనసాగించలేకపోయారు. సెకెండాఫ్ కు వచ్చేసరికి మలయాళీ వెర్షన్ లో ఉన్న నెరేషన్ ను ఫాలో అవ్వకుండా, తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు సన్నివేశాల్ని ఫాస్ట్ గా చూపించాల్సింది. ఈ విషయంలో ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకోలేకపోయారు జీవిత. తిరిగి ప్రీ-క్లయిమాక్స్ కు వచ్చేసరికి సినిమా ఊపందుకుంటుంది.

క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇదే కరెక్ట్. స్పాయిలర్స్ ఉండకూడదు కాబట్టి క్లయిమాక్స్ ఏంటనేది చెప్పడం లేదు. కాకపోతే ఆల్రెడీ ఒరిజినల్ చూసినవారికి ఈ క్లయిమాక్స్ లో కొన్ని కంప్లయింట్స్ కనిపిస్తాయి. ఇక స్ట్రయిట్ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ క్లయిమాక్స్ ను ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఇక ఓ కీలక పాత్ర కోసం శివానీ రాజశేఖర్ ను తీసుకోవడం మంచి ఎత్తుగడ. ఉన్నదే చాలా తక్కువ టైమ్. ఆ తక్కువ టైమ్ లో తండ్రికూతుళ్ల మధ్య అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే రియల్ లైఫ్ కూతుర్ని, రీల్ లైఫ్ లోకి తీసుకురావడమే మార్గం. ఈ ఎపిసోడ్ మాత్రం బాగుంది. అయితే రాజశేఖర్ కు లవ్ స్టోరీ పెట్టి, అక్కడో పాట కూడా పెట్టడం సినిమా వేగాన్ని మరింత తగ్గించేసింది.

డైరక్టర్ గా జీవిత రాజశేఖర్ కొన్ని చోట్ల తన టాలెంట్ చూపించారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో, భార్య చనిపోయిన సీన్ లో, క్లైమాక్స్ లో రాజశేఖర్ నటన హైలెట్. ఈ సన్నివేశాల్ని జీవిత చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఒరిజినల్ వెర్షన్ ను మక్కికిమక్కి ఫాలో అవ్వడం వల్ల, సినిమా స్లోగా సాగుతుంది. అనూప్ రూబెన్స్ పాటలు పెద్దగా ఆకట్టుకోకపోవడం మరో మైనస్.

ఓవరాల్ గా శేఖర్ సినిమా రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కోసం, ఇంటర్వెల్, క్లయిమాక్స్ ట్విస్టుల కోసం ఓసారి చూడొచ్చు. కాకపోతే కాస్త ఓపిక అవసరం.

రేటింగ్ - 2.5/5